
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ.. సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించడంతో.. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహయంతో కారును తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment