
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తున్న సిటీ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.