Rtc bus - bike collision
-
జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..!
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తున్న సిటీ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు- బైక్ ఢీ: ఒకరి మృతి
మహబూబ్ నగర్(కొత్తూరు): ఆర్టీసీ బస్సును, బైక్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై ఐఒసీఎల్ పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు పోయించుకుని వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు వేగంగా వెళ్లి గరుడ బస్సును ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం మృతుడు శంషాబాద్‌కు చెందిన రియాజ్‌గా గుర్తించారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఒకరి మృతి
తిరుమల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన తిరుమల ఘాట్‌రోడ్డులోని చివరి మలుపు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. రైల్వేకోడూరు మండలానికి చెందిన రంగనాథ్(40) బైక్‌పై ఘాట్‌రోడ్డులో వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. దీంతో రంగానాథ్ బస్సు కింద పడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగనాథ్ మృతిచెందాడు.