మహబూబ్ నగర్(కొత్తూరు): ఆర్టీసీ బస్సును, బైక్ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై ఐఒసీఎల్ పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు పోయించుకుని వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు వేగంగా వెళ్లి గరుడ బస్సును ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం మృతుడు శంషాబాద్‌కు చెందిన రియాజ్‌గా గుర్తించారు.