బైక్ రేసులు... వీఐపీల పుత్రరత్నాలు అరెస్ట్ | 15 youth arrested due to midnight bike racing at Hyderabad | Sakshi
Sakshi News home page

బైక్ రేసులు... వీఐపీల పుత్రరత్నాలు అరెస్ట్

Published Sun, Apr 20 2014 11:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బైక్ రేసులు... వీఐపీల పుత్రరత్నాలు అరెస్ట్ - Sakshi

బైక్ రేసులు... వీఐపీల పుత్రరత్నాలు అరెస్ట్

జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతంలో అర్థరాత్రి తప్ప తాగి బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 15 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుల వద్ద నుంచి 8 అత్యంత ఖరీదైన బైకులతోపాటు, భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకులను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. యువకులను పోలీసులు విచారించగా పలు అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న యువకులంతా నగరానికి చెందిన ప్రముఖ విఐపీల కుమారులని తేలడంతో పోలీసులు సదరు యువకుల తల్లితండ్రులకు సమాచారం అందించారు. దాంతో వీఐపీలంతా జూబ్లీహిల్స్ స్టేషన్కు తరలి వచ్చారు. తల్లితండ్రుల సమక్షంలో యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. బైక్ రేసింగ్లపై నిషేదం ఉన్నా యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడటంతో పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement