Ronaldras collector
-
Underpass: బంజారాహిల్స్ టు జూబ్లీహిల్స్!
మహానగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త ప్రభుత్వం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న జంక్షన్లలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేంచాలని, ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ జంక్షన్లలో తలెత్తుతున్న వాహన రద్దీని అదుపులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌పై జీహెచ్ఎంసీ, పోలీసులతో సమీక్ష నిర్వహించిన సీఎం నగరంలోనే అత్యధిక రద్దీతో రికార్డుల్లోకెక్కిన జూబ్లీహిల్స్ జంక్షన్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45, రోడ్డు నెంబర్–36తో పాటు జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, విరించి హాస్పటల్ చౌరస్తా, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో రెండు విడతలుగా పర్యటించారు. ► ట్రాఫిక్ ఎక్కడెక్కడ రద్దీగా ఉంటుందో పరిశీలించడమే కాకుండా అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఏమి చేస్తే బాగుంటుందనే దానిపై అప్పటికే ట్రాఫిక్‌పై అధ్యయనం చేసిన అధికారులతో చర్చించి డిజైన్లను పరిశీలించారు. అండర్‌పాస్‌లు.. ఫ్లైఓవర్లు... జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ పర్యటనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. ► ఇందులో భాగంగా అడ్డుగా ఉన్న డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లను మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించారు. ► కేబీఆర్ పార్కులో ఒక్క చెట్టు కూడా నష్టపోకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీని ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్ వైపు, రోడ్డు నెంబర్–45 వైపు వాహనదారులు కేబీఆర్ పార్కు నుంచి ఎలాంటి ఆటంకా>లు లేకుండా తేలిగ్గా ముందుకుసాగనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ► జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నుంచి వాహనాలు దిగిన తర్వాత ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ మీదుగా బంజారాహిల్స్ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే అటు అండర్‌పాస్, ఇటు ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం సంబంధిత ఇంజినీర్లు డిజైన్లు కూడా పూర్తిచేయగా, ఆ మ్యాప్‌లను జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లు పరిశీలించారు. ► జర్నలిస్ట్ కాలనీ చౌరస్తాలో ప్రముక పాత్రికేయుడి శిలా విగ్రహం రోడ్డు మధ్యలోకి రావడంతో ఆ విగ్రహాన్ని సెంట్రల్ మీడియన్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ఓ దఫా చర్చించారు. మరోసారి సంబంధిత ప్రతినిధులతో సంప్రదించి ఈ విగ్రహాన్ని మరింత సుందరంగా చౌరస్తా మధ్యలో నిర్మించాలని నిర్ణయించారు. ► దీని ద్వారా జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లే వాహనదారులు మరింత తేలికగా ముందుకుసాగనున్నారు. ► కేబీఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ జంక్షన్, జర్నలిస్ట్‌కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45 జంక్షన్, సీవీఆర్ న్యూస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 అగ్రసేన్ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్ మీడియన్లను కొంతమర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ► నాలుగువైపులా వాహనాలు తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్ మీడియన్లను కట్ చేయనున్నారు. 20 సంవత్సరాలు క్రితం అప్పటి ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ చౌరస్తాలు రూపుదిద్దుకోగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న మార్పు కూడా చేయకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, రోడ్లు, జంక్షన్ల విస్తరణ కూడా చేపట్టలేదు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జంక్షన్ల విస్తరణకు ముందుకురావడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేయాలని నిర్ణయించింది. ► కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫిలింనగర్ వెళ్లే జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా చాలా వెడల్పుగా ఉంది. ఫిలింనగర్ వైపు 2, 3 బస్టాపులు అనవసరంగా నిర్మించారు. ► హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్ వెడల్పును తగ్గించి మూడు బస్òÙల్టర్లను తీసేయడం ద్వారా ఫిలింనగర్ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళతారని నిర్ణయించారు. ► ఇక కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్ స్థలాల్లో మలీ్టలెవల్ పార్కింగ్ సౌకర్యాలు కలి్పంచే దిశలో కూడా అధికారులు చర్చించారు. -
వందేళ్ల అద్భుత దర్శనం
♦ ప్రోజెక్టర్ ద్వారా ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ వీక్షణం ♦ కొండాపూర్ గురుకుల పాఠశాలలో కార్యక్రమం ♦ హాజరైన కలెక్టర్ రోనాల్డ్‌రాస్ కొండాపూర్: వందేళ్లలో 14వ సారి వెలుగుచూసిన ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీ అద్భుతాన్ని కొండాపూర్ గురుకుల విద్యార్థులతో పాటు కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సోమవారం వీక్షించారు. గురుకులంలో బ్రైటర్మైండ్స్ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు వీలుగా విద్యార్థులకు ఖగోళ పరిశోధకుడు రఘునందన్‌కుమార్ జర్మనీ, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసిన సోలార్ఫిల్టర్(సూర్యుడిని చూసే పరికరం)లను అందజేశారు. ఈ సందర్భంగా ఖగోళ పరిశోధకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు ట్రాన్సిట్ ఆఫ్ మెర్క్యూరీని చూపించాలనుకు న్నా ఇక్కడి వాతావరణం సహకరించలేదన్నా రు. అందుకే అమెరికాకు చెందిన నాసా సంస్థ పంపిన ఉపగ్రహం(సోలార్ డైనమిక్ అబ్జర్వరీ) సహాయంతో ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యక్షంగా చూ పించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఖగోళశాస్త్రంలో వెలుగుచూడటం చాలా అరుదన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా భారతదేశంలో వీక్షించే అవకాశం మాత్రం లభించలేదని తెలిపారు. ఈ నెల 22వ తేదిన ఖగోళశాస్త్రంలో మరొక అద్భుత సంఘటన జరుగుతుందని పేర్కొన్నారు. అంగారకు డు, భూమి, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వస్తాయన్నారు. విద్యార్థుల వీక్షణానికి కృషి చేసిన కలెక్టర్, యూనిసెఫ్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్లానిటోరియంలు లేకపోవడంతో ఖగోళశాస్త్రం గురించి తెలుసుకోవడం విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, ప్లానిటోరియం ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారు చెప్పిన సమాధానాలపై సంతృప్తి చెందారు. ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, కళాశాల ప్రిన్సిపల్ గోదావరి, తహసీల్దార్ లావణ్య, పీడీ గణపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మినరల్ వాటర్ తియ్యగా ఉండొద్దు..
కలెక్టర్ రోనాల్డ్‌రాస్ పటాన్చెరు/రామచంద్రాపురం: కలెక్టర్ రోనాల్డ్‌రాస్ శనివారం పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పటాన్చెరు పట్టణంలోని రామేశ్వరంబండలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైల్వే భూములను పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిమిత్తం కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి కోరారు. విషయాన్ని పరిశీలిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రామచంద్రాపురం పట్టణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు కొనుగోలు చేసిన ట్యాంకర్లను కలెక్టర్ ప్రారంభించారు. తమ సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించనున్నట్టు వారు కలెక్టర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాటర్ ట్యాంకర్‌ను నడిపారు. అనంతరం ఇక్రిశాట్ ఫెన్సింగ్ కాలనీలో కలెక్టర్ మినరల్ వాటర్‌ప్లాంటు పనులను ప్రారంభించారు. నీళ్లు తియ్యగా ఉంటాయా.. రామచంద్రాపురం : ఈ నీళ్లు తీయ్యగా ఉంటాయా.. అవును సార్.. అయితే ఈ నీళ్లు ప్రజలకు అవసరం లేదు. అన్నారు కలెక్టర్.. ఈ సంభాషణ పట్టణంలోని భారతీనగర్ కాలనీ మినరల్ వాటర్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుణ్ని ప్రశ్నించారు. భారతీనగర్‌లోని మినరల్ వాటర్ ప్లాంటు పనితీరును కలెక్టర్ పరిశీలించారు. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకుణ్ని ప్లాంటు ఏ విధంగా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నారు. నీళ్లు తియ్యగా ఉంటాయా అని కలెక్టర్ ప్రశ్నించారు. దీంతో నిర్వాహకులు అవును సార్ తియ్యగా ఉంటాయని చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎక్కువ తియ్యగా ఉంటే మంచిది కాదని నిర్వాహకులకు తెలిపారు. బోరు నుంచి తీసిన నీటిని శుద్ధి చేసి తగిన మోతాదులో మినరల్ కలిపితే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ల డ్రైవర్.. అజీజ్
- పలుసార్లు ఉత్తమ డైవర్‌గా మన్ననలు - నేడు ఉద్యోగ విరమణ ప్రగతినగర్: అజీజ్.. జిల్లాలో పనిచేసిన కలెక్టర్లందరికీ ఈ పేరు సుపరిచితం. ఎవరాయన.. ఏంటీ ఆయన ప్రత్యేకత.. అంటారా..? ఆయన కలెక్టర్ కారు డ్రైవర్. ఓస్ అంతేనా..! అని అనుకోకండి. ఒకటి కాదు.. రెండు కాదు.. ముప్పైఏళ్లుగా ఎలాంటి చిన్నపొరపాటు కూడా లేకుండా వాహనాన్ని నడిపిన ఘనత ఆయనది. అలాగే 20మంది కలెక్టర్లకు డ్రైవర్‌గా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రాణపాయం నుంచి ఓ కలెక్టర్ ప్రాణాలూ కాపాడారు. ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసా పత్రాలూ అందుకున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అలా ఉద్యోగంలోకి జిల్లాకేంద్రంలోని అజ్మీకాలనీకి చెందిన అజీజ్ మియాకు భార్య షహనాజబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత ఉపాధి కోసం చాలాకాలం ప్రయత్నాలు చేశారు. కానీ తనకు తగ్గట్లు ఏ ఉద్యోగమూ దొరకలేదు. ఒకరోజు జిల్లా ఉపాధి కల్పనాధికారి వాహనం చెడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న అజీజ్ ఆ వాహనాన్ని చెక్ చేసి, మరమ్మతు చేశారు. అప్పటి నుంచి అజీజ్ అధికారుల దృష్టిలో పడ్డారు. అప్పటి జిల్లా కలెక్టర్ అజేయంద్రపాల్ ఏకంగా ఆయనకు తన డ్రైవ ర్గా పోస్టింగ్ ఇచ్చారు. అలా 1987లో కలెక్టర్ కారు డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించిన అజీజ్మియా నేటి వరకు కొనసాగారు. అనంతరం జిల్లా కలెక్టర్లుగా ఉన్న వెంకటేశ్వర్రావు, బినయ్‌కుమార్, చక్రపాణి, తుకారాం, మన్మోహన్సింగ్, బి.ఎం.గోనెల, అభయ్‌త్రిపాఠి, శశాంక్‌గోయల్, అశోక్‌కుమార్, డి.వి.రాయుడు, వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ కుమార్, రామాంజనేయులు, సునీత, వరప్రసాద్, క్రిస్టినా జెడ్ చోంగ్తుల డ్రైవర్‌గా ఉన్నారు. అనంతరం ఆరునెలలపాటు ఇన్చార్జి కలెక్టర్‌గా జేసి హర్షవర్దన్, అనంతరం కలెక్టర్ ఏఎస్.ప్రద్యుమ్న, ప్రస్తుత కలెక్టర్ రొనాల్డ్‌రాస్ డ్రైవర్‌గా పనిచేశారు. అజీజ్మియా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. గోనెల ప్రాణాలు కాపాడి 1996లో కలెక్టర్‌గా ఉన్న ఆర్.ఎం.గోనెల ఒకసారి విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు బయలు దేరారు. కలెక్టర్ వాహనం ఇందల్వాయి-రాంచంద్రపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైనా కారు డ్రైవర్ అజీజ్ వాహనాన్ని వేగంగా వెనక్కు తిప్పారు. మావోయిస్టులకు చిక్కకుండా కలెక్టర్‌ను సురక్షితంగా నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. అలా అజీజ్ మియా పలువురు కలెక్టర్ల చేతుల మీదుగా ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్నారు.