సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సామాన్య మహిళనైన నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గిరిజన, మహిళలకు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయమని ఆదేశించారని తెలిపారు.
మానుకోట ప్రజానీకం అభివృద్ధికి కేసీఆర్ సహకారంతో వైద్య విద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ‘డోర్నకల్ నియోజకవర్గంలో మీకంటూ ఒక వర్గం ఉన్నది.. పార్టీ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీ వారు ఎవరూ హాజరు కావట్లేదని’ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తూ..ఇది సందర్భం కాదంటూనే..మాకంటూ వర్గమేమీ లేదని, మేమంతా ముఖ్యమంత్రి గొడుగు కింద పనిచేస్తాం..ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు.
చదవండి: తెలంగాణలో బీజేపీని తుడిచివేస్తామన్న రాహుల్.. దాని వెనక మర్మమేంటో?
Comments
Please login to add a commentAdd a comment