ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షాలు | Heavy Rains In Warangal 2nd August | Sakshi
Sakshi News home page

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షాలు

Published Fri, Aug 2 2019 3:26 PM | Last Updated on Fri, Aug 2 2019 3:28 PM

Heavy Rains In Warangal 2nd August - Sakshi

సాక్షి, వరంగల్‌ :  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా,  అత్యల్పంగా పెద్ద వంగరలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా : ఐనవోలులో 8.7, వేలేరులో 8.3, ఎల్కతుర్తిలో 7.5, హన్మకొండలో 7.0, హసన్‌పర్తిలో 5.8, వరంగల్‌లో 5.0, ధర్మసాగర్‌లో 4.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా : ఖానాపూర్‌లో 18.2, చెన్నారావుపేటలో 14.8, పరకాలలో 12.0, సంగెంలో 10.0, నల్లబెల్లిలో 7.3, వర్ధన్నపేటలో 6.2, నెక్కొండలో 6.0, దుగ్గొండిలో 5.4, దామెరలో 5.6, ఆత్మకూరులో 5.2, పర్వతగిరిలో 5.0, నడికుడలో 3.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది.

ములుగు జిల్లా : కన్నాయిగూడెంలో 27.8 మిల్లీమీటర్లు, వెంకటాపురంలో 12.9, వెంకటాపూర్‌లో 9.6, గోవిందరావుపేటలో 9.0, వాజేడులో 8.5, ములుగులో 7.3, తాడ్వాయిలో 7.3, మంగపేటలో 7.0, ఏటూర్‌నాగారంలో 6.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

జయశంకర్‌ జిల్లా : మహాముత్తారం మండలంలో 14.6 మి.మీలు, పలిమెలలో 10.5, కాటారంలో 10.2, మొగుళ్లపల్లిలో 10.0, మల్హర్‌రావులో 6.1, టేకుమట్లలో 3.3, మహదేవ్‌పూర్‌లో 3.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది.

మహబూబాబాద్‌ జిల్లా : డోర్నకల్‌లో 28.8, గంగారంలో 27.5, మరిపెడలో 15.2, గార్లలో 11.1, కురవిలో 11.8, గూడురులో 11.2, కొత్తగూడలో 8.2, చెన్నారావుపేటలో 8.0, కేసముద్రంలో 5.2, నర్సింహులపేటలో 5.4, పెద్దవంగరలో 3.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

జనగామ జిల్లా : తరిగొప్పులలో 11.5 మి.మీలు, చిల్పూర్‌లో 8.3, జఫర్‌గఢ్‌లో 8.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement