సాక్షి, డోర్నకల్: అంతరించిపోతున్న ఓ చిన్న క్షీరదం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని లచ్చతండాలో కనబడింది. ఆర్మడిల్లోగా పిలువబడే ఈ క్షీరదం దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి ఆర్మడిల్లో లచ్చతండాలో కనబడటంతో స్థానికంగా ఉన్నవారు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమిని డ్రిల్ మిషన్ మాదిరి తవ్వుకుంటూ లోనికి వెళ్లే అరుదైన జీవిగా ఆర్మడిల్లోకు పేరుంది.
కాగా, స్పానిష్ భాషలో ఆర్మడిల్లో అంటే కవచం ఉన్న జీవి అని అర్థం. పలు జీవులకు రక్షణగా కొన్ని శరీర భాగాలు ఉన్నట్టే.. ఆర్మడిల్లోకు కూడా శరీరంపై ఉండే కవచం రక్షణ కల్పిస్తుంది. వీటిలో దాదాపు 20కు పైగా జాతులు ఉన్నాయి. ఆర్మడిల్లో ఒంటిపై ఉన్న చారల ఆధారంగా అది ఏ జాతికి చెందిందో గుర్తిస్తారు. ఈ జీవికి ప్రమాదం ఎదురైతే కాళ్లను, తలను కవచంలోకి ముడిచిపెట్టుకుంటుంది. వీటికున్న ప్రత్యేకత ఎంటటే.. ఇవి నేలను తవ్వుకుంటూ లోనికి వెళ్లి తమకు రక్షణ కల్పించుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment