drilling
-
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
Uttarakhand: రెస్క్యూ బృందాలకు 5 మీటర్ల దూరంలో కార్మికులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొరంగంలోని బండరాళ్లను తవ్వే క్రమంలో అవంతరాలు ఎదురవ్వడంతో రెస్క్యూ ప్లాన్లను మార్చి మార్చి అమలు చేస్తున్నారు. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనపెట్టి.. కొండపై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను సోమవారం మొదలు పెట్టారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. First visuals of manual drilling ongoing inside the rescue tunnel. Auger machine is being used for pushing the pipe. So far about 2 meters of… pic.twitter.com/kXNbItQSQR— ANI (@ANI) November 28, 2023 ఇక ‘ర్యాట్ హోల్ మైనింగ్’ బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ముందుగా 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలో దూరిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మాన్యువల్ డ్రిల్లింగ్ ద్వారా శిథిలాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తయింది. చదవండి: ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing. Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. So far about 2 meters of manual… pic.twitter.com/oIMNAxvre2— ANI (@ANI) November 28, 2023 మరోవైపు టన్నెల్ పైభాగం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర మైక్రో టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ బృందాల నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారు. ఈ పద్దతి ద్వారా గురువారం నాటికి కార్మికులను బయటకు తీయాలని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Micro tunnelling expert Chris Cooper says, "...It went very well last night. We have crossed 50 metres. It's now about 5-6 metres to go...We didn't have any obstacles last night. It is looking very positive..." pic.twitter.com/HQssam4YUs— ANI (@ANI) November 28, 2023 కాగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టన్నెల్ వద్దకు నేడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి వెళ్లారు. సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. ఇక ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! -
Uttarkashi tunnel collapse: శరవేగంగా డ్రిల్లింగ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండపై భాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగర్ డ్రిల్లింగ్ మెషీన్ తవ్వుతున్నపుడు రాడ్లు అడ్డుతగిలి మెషీన్ ధ్వంసమవడం తెల్సిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేయనున్నారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఈ మార్గంలో ఇంకా 8.15 మీటర్లమేర బ్లేడ్ల ముక్కలను తొలగించాల్సిఉంది. ఆ తర్వాతే మ్యాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుంది. మరోవైపు, కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు. రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదలనున్నారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. -
సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్?
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం లోపల నుంచి డ్రిల్లింగ్ పనులు సాగుతున్నా, ఆటంకాలు తలెత్తుతుండటంతో సొరంగం పైనుంచి కూడా డ్రిల్లింగ్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని జియోఫిజికల్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నిపుణులు నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌డీసీఎల్)కి సమర్పించారు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల నుండి బాధిత కార్మికులను చేరేందుకు మార్గం ఏర్పడని పక్షంలో సొరంగం పైనుండి కూడా డ్రిల్ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కసరత్తు ప్రారంభించారు. డ్రిల్లింగ్ చేయాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిని జియోఫిజికల్ నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్సన్ కంపెనీకి చెందిన జియోఫిజికల్ నిపుణుడు బి భాస్కర్ మాట్లాడుతూ. ఆ స్థలాన్ని పరిశీలించామని, డ్రిల్‌కు ఆ ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు అడ్డురావని తేలిందన్నారు. కాగా డ్రిల్లింగ్ సమయంలో ఏదైనా నీటి వనరు అడ్డుపడితే మొత్తం ఆపరేషన్‌తో పాటు 41 మంది కూలీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇతర ఎంపికలలో భాగంగా సొరంగం పై నుండి డ్రిల్ చేయడానికి అతిపెద్ద డ్రిల్ యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాగాలుగా తీసుకువచ్చారు. తరువాత దానిని అనుసంధానించారు. ఇతర డ్రిల్ యంత్రాలను కూడా ఇక్కడకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు -
గుడ్‌న్యూస్.. రాత్రి వరకు సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకి!
ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం నుంచి బాధిత కార్మికులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న నలబై ఒక్క మంది కార్మికులను బయటకు తీసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలోని కార్మికులను వెలికి తీసేందుకు సహాయ బృందాలు కేవలం 12 మీటర్ల దూరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. నేటి రాత్రి 11. 30 గంటలలోపు మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పనులన్నీ ఆశావహంగా సాగుతున్నాయని చెబుతున్నాయని, అమెరికాకు చెందిన డ్రిల్లింగ్ మిషన్ మరో ఆరు మీటర్ల శిథిలాలను తొలగించినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక అధికారి భాస్కర్ ఖుల్బే పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మేము మరో ఆరు మీటర్లు ముందుకు వెళ్లగలిగామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మరో రెండు గంటల్లో తదుపరి దశకు సద్ధమవుతున్నాం. అతి తక్కువ సమయంలోనే మిగిలిన పనిని పూర్తి చేయగలమని భావిస్తున్నాం’ అని మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు 67శాతం డ్రిల్లింగ్ పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది కార్మికుల కోసం పడకలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే టన్నెల్ బయట 20 అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే! #WATCH | NDRF personnel enter Silkyara tunnel as operation to rescue 41 trapped workers intensifies, in Uttarakhand pic.twitter.com/f9LCO5PBun — ANI (@ANI) November 22, 2023 సహాయక చర్యలు కీలక దశకు చేరుకోవడంతో తమ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. వారిని విమానంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. డెహ్రాడూన్ నుంచి రాంచీకి విమానంలో తరలించనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ప్రమాదం జరిగి పది రోజులు కావొస్తుంది. చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఫోన్లు కూడా పంపించి వారితో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌తో సహా ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు ఈ భారీ ప్రయత్నానికి పూనుకున్నాయి. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | A machine that was stuck yesterday due to the road being narrow, has now reached the Silkyara tunnel site where rescue operations to bring out the trapped workers are underway. pic.twitter.com/KbN6OvYdFC — ANI (@ANI) November 22, 2023 -
ఓఎన్జీసీ రూ.16వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్జీసీ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్ టన్నుల ఆయిల్, గ్యాస్ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్ టన్నులు, గ్యాస్ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది. -
Telangana: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ వస్తోంది. ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్స్ తయారీ దిగ్గజ కంపెనీ ‘డ్రిల్మెక్ ఎస్పీఏ’ హైదరాబాద్‌లో 200 మిలియన్ యూఎస్ డాలర్ల (రూ.1,500 కోట్ల) భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ శాఖతో డ్రిల్మెక్ సంస్థ సోమవారం ఇక్కడ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. డ్రిల్మెక్ ఎస్పీఏ సీఈఓ సిమోన్ ట్రెవిసాని, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. రిగ్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి డ్రిల్మెక్ ఎస్పీఏ స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రారంభించనుంది. ఆయిల్ రిగ్‌లు, అనుబంధ పరికరాల తయారీకి డ్రిల్మెక్ రాష్ట్రంలో అంతర్జాతీయ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇటలీలోని పోడెన్‌జానో పీసీ కేంద్రంగా రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న డ్రిల్మెక్ను 2020లో మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. డ్రిల్మెక్ 200 మిలియన్ యూఎస్ డాలర్ల వార్షిక టర్నోవర్‌ను కలిగి ఉంది. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం, పనితీరు నచ్చి.. డ్రిల్మెక్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 600 డ్రిల్లింగ్ రిగ్‌లను సరఫరా చేసింది. రిగ్‌ల రూపకల్పనలో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. చమురు, ఇంధనం వెలికితీసే హైటెక్ రిగ్‌లను ఇప్పటికే తమ సంస్థ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిందని ఎంఈఐఎల్ పేర్కొంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో చమురు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్‌ల తయారీ, వర్క్ ఓవర్ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్ లీడర్‌గా ఉందని చెప్పింది. డ్రిల్లింగ్ రిగ్లకు అవసరమైన విడిభాగాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో పరిశ్రమలకు స్నేహపూర్వక వాతావరణం, ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నట్టు డ్రిల్మెక్ ఎస్పీఏ సీఈఓ సిమోన్ ట్రెవిసాని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమ హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్టును భారత్‌లోకి తీసుకొస్తావని ప్రకటించారు. తమ వద్ద 1 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, హైదరాబాద్ యూనిట్‌తో సరఫరా వేగం పెరుగుతుందని డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ సీఈఓ ఉమా మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నాణ్యమైన మానవ వనరులను తయారు చేస్తామన్నారు. 5 ఖండాల్లో.. 30కి పైగా దేశాల్లో డ్రిల్మెక్ డ్రిల్మెక్ ఎస్పీఏ ఇటలీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ హైడ్రో కార్బన్ సంస్థ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాండ్ డ్రిల్లింగ్, వర్కోవర్ రిగ్స్, ఇతర డ్రిల్లింగ్ ఉపకరణాలను తయారు చేస్తుంది. 5 ఖండాల్లో విస్తరించి 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంప్రదాయ డ్రిల్లింగ్ రిగ్గులైన స్వింగ్ లిఫ్ట్/స్లింగ్ షాట్, మొబైల్ రిగ్స్, ఆటోమేటిక్ రిగ్స్, హైడ్రాలిక్, హెచ్‌హెచ్ సిరీస్, స్ట్రైకర్–800 వంటి సంప్రదాయేతర ప్లే రిగ్స్ తయారీలో మేటి. వీటిని ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ క్షేత్రాల్లో వాడతారు. భూ ఉపరితలం నుండి 6 వేల మీటర్ల వరకు సులువుగా.. అతి శీతల, అత్యుష్ణోగ్రతల్లో కూడా సమర్థంగా పని చేసే రిగ్స్‌ను తయారు చేసే కంపెనీగా గుర్తింపు పొందింది. -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
మహబూబాబాద్‌లో అరుదైన జీవి.. వైరల్ వీడియో
సాక్షి, డోర్నకల్: అంతరించిపోతున్న ఓ చిన్న క్షీరదం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని లచ్చతండాలో కనబడింది. ఆర్మడిల్లోగా పిలువబడే ఈ క్షీరదం దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి ఆర్మడిల్లో లచ్చతండాలో కనబడటంతో స్థానికంగా ఉన్నవారు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమిని డ్రిల్ మిషన్ మాదిరి తవ్వుకుంటూ లోనికి వెళ్లే అరుదైన జీవిగా ఆర్మడిల్లోకు పేరుంది. కాగా, స్పానిష్ భాషలో ఆర్మడిల్లో అంటే కవచం ఉన్న జీవి అని అర్థం. పలు జీవులకు రక్షణగా కొన్ని శరీర భాగాలు ఉన్నట్టే.. ఆర్మడిల్లోకు కూడా శరీరంపై ఉండే కవచం రక్షణ కల్పిస్తుంది. వీటిలో దాదాపు 20కు పైగా జాతులు ఉన్నాయి. ఆర్మడిల్లో ఒంటిపై ఉన్న చారల ఆధారంగా అది ఏ జాతికి చెందిందో గుర్తిస్తారు. ఈ జీవికి ప్రమాదం ఎదురైతే కాళ్లను, తలను కవచంలోకి ముడిచిపెట్టుకుంటుంది. వీటికున్న ప్రత్యేకత ఎంటటే.. ఇవి నేలను తవ్వుకుంటూ లోనికి వెళ్లి తమకు రక్షణ కల్పించుకుంటాయి. -
నీటి సమస్య పరిష్కారానికి నిధులివ్వండి
మదనపల్లె/బి.కొత్తకోట: సీఎం సొంత జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని, వెంటనే నీటి కోసం నిధులు కేటాయించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె ఎంపీ కార్యాలయంలో పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు సంబంధించి తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం తన నిధుల్లో ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో బోరు డ్రిల్లింగ్, రీబోర్, ట్రాన్స్పోర్ట్, టైయప్ తదితర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా సమస్య తీవ్రతను గుర్తించి నిధులు మంజూరు చేయాలని కోరారు. మైనారిటీల కోసం రూ.25 లక్షలతో షాదీమహల్, కమ్యూనిటీ హాలును నిర్మించేందుకు నిధులు మంజూ రు చేసినట్లు చెప్పారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డి, ఎంపీపీలు జరీనా హైదర్, సుజనా, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, భాస్కర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆటోనగర్ నిర్మాణానికి హామీ.. పట్టణ శివారు ప్రాంతంలోని మొలకలదిన్నె వద్ద ఆటోనగర్‌ను నిర్మించాలని ఆటోనగర్ గౌరవాధ్యక్షులు, కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో కార్మిక నాయకులు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆయన జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ షమీమ్ అస్లాం, వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షులు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఏ కరీ ముల్లా, మైనారిటీ విభాగం నియోజకవర్గ నాయకులు బాబ్జాన్, కౌన్సిలర్లు మహ్మద్ రఫి, ముక్తియార్ ఖాన్ పాల్గొన్నారు. టీడీపీ మోసాలపై ప్రజల తిరుగుబాటు అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలిచ్చిన ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. బి.కొత్తకోటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీని టమాట రైతులకు వర్తింపజేయకపోవడం అన్యామన్నారు. చిత్తుశుద్ధి ఉంటే టమాట రైతులకూ మాఫీ ప్రకటించాలనీ డిమాండ్ చే శారు. కడప-బెంగళూరు రైల్వేమార్గం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముం దుకు సాగడం లేదని తెలిపారు. రాజం పేట పార్లమెంటు నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇంది రమ్మ గృహ నిర్మాణాలకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాదిలో ప్రభుత్వ పనితీరు తెలిపోతుందని అన్నారు.