మదనపల్లె/బి.కొత్తకోట: సీఎం సొంత జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని, వెంటనే నీటి కోసం నిధులు కేటాయించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె ఎంపీ కార్యాలయంలో పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు సంబంధించి తాగునీటి సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం తన నిధుల్లో ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిధులతో బోరు డ్రిల్లింగ్, రీబోర్, ట్రాన్స్‌పోర్ట్, టైయప్ తదితర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా సమస్య తీవ్రతను గుర్తించి నిధులు మంజూరు చేయాలని కోరారు. మైనారిటీల కోసం రూ.25 లక్షలతో షాదీమహల్, కమ్యూనిటీ హాలును నిర్మించేందుకు నిధులు మంజూ రు చేసినట్లు చెప్పారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డి, ఎంపీపీలు జరీనా హైదర్, సుజనా, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, భాస్కర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆటోనగర్ నిర్మాణానికి హామీ..
పట్టణ శివారు ప్రాంతంలోని మొలకలదిన్నె వద్ద ఆటోనగర్‌ను నిర్మించాలని ఆటోనగర్ గౌరవాధ్యక్షులు, కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో కార్మిక నాయకులు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆయన జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాతో ఫోన్‌లో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ షమీమ్ అస్లాం, వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షులు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్‌ఏ కరీ ముల్లా, మైనారిటీ విభాగం నియోజకవర్గ నాయకులు బాబ్‌జాన్, కౌన్సిలర్లు మహ్మద్ రఫి, ముక్తియార్ ఖాన్ పాల్గొన్నారు.
టీడీపీ మోసాలపై ప్రజల తిరుగుబాటు
అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలిచ్చిన ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. బి.కొత్తకోటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీని టమాట రైతులకు వర్తింపజేయకపోవడం అన్యామన్నారు. చిత్తుశుద్ధి ఉంటే టమాట రైతులకూ మాఫీ ప్రకటించాలనీ డిమాండ్ చే శారు.
కడప-బెంగళూరు రైల్వేమార్గం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముం దుకు సాగడం లేదని తెలిపారు. రాజం పేట పార్లమెంటు నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇంది రమ్మ గృహ నిర్మాణాలకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాదిలో ప్రభుత్వ పనితీరు తెలిపోతుందని అన్నారు.
నీటి సమస్య పరిష్కారానికి నిధులివ్వండి
Published Sun, Sep 28 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement