peddireddi mithunreddi
-
ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి
- భావితరాల కోసమే 29న రాష్ట్ర బంద్ - అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి - పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం : రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈ నెల 29న చేపడుతున్న బంద్ విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలోని వీకే మెమోరియల్ హాలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెనుకొండ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు సోనియాగాంధీనే ఎదిరించి పోరాటం చేశామని, ఆ క్రమంలో మన అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అదే స్ఫూర్తితో ఈ రోజు మనందరం కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అనంతపురం జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లని, మన గళం ఢిల్లీ పెద్దల గుండెల్లో దడ పుట్టించాలని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, ప్యాకేజీ సాధించుకోవడానికి బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అన్ని వర్గాల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.24 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు పోరాటాలు కొనసాగించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈ నెల 10న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బంద్‌కు పిలుపునిస్తే.. దీన్ని అడ్డుకోవాలని అధికార పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దిగుజారుడు విమర్శలకు దిగడం సిగ్గుచేటు అన్నారు. ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బంద్ ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపేందుకు కరపత్రాలు, పోస్టర్లు, బైకు ర్యాలీల ద్వారా విసృ్తత ప్రచారం నిర్వహించాలని సూచించారు. -
నీటి సమస్య పరిష్కారానికి నిధులివ్వండి
మదనపల్లె/బి.కొత్తకోట: సీఎం సొంత జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని, వెంటనే నీటి కోసం నిధులు కేటాయించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె ఎంపీ కార్యాలయంలో పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు సంబంధించి తాగునీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం తన నిధుల్లో ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో బోరు డ్రిల్లింగ్, రీబోర్, ట్రాన్స్పోర్ట్, టైయప్ తదితర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా సమస్య తీవ్రతను గుర్తించి నిధులు మంజూరు చేయాలని కోరారు. మైనారిటీల కోసం రూ.25 లక్షలతో షాదీమహల్, కమ్యూనిటీ హాలును నిర్మించేందుకు నిధులు మంజూ రు చేసినట్లు చెప్పారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డి, ఎంపీపీలు జరీనా హైదర్, సుజనా, జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి, భాస్కర్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆటోనగర్ నిర్మాణానికి హామీ.. పట్టణ శివారు ప్రాంతంలోని మొలకలదిన్నె వద్ద ఆటోనగర్‌ను నిర్మించాలని ఆటోనగర్ గౌరవాధ్యక్షులు, కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో కార్మిక నాయకులు ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆయన జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ షమీమ్ అస్లాం, వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షులు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఏ కరీ ముల్లా, మైనారిటీ విభాగం నియోజకవర్గ నాయకులు బాబ్జాన్, కౌన్సిలర్లు మహ్మద్ రఫి, ముక్తియార్ ఖాన్ పాల్గొన్నారు. టీడీపీ మోసాలపై ప్రజల తిరుగుబాటు అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలిచ్చిన ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. బి.కొత్తకోటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీని టమాట రైతులకు వర్తింపజేయకపోవడం అన్యామన్నారు. చిత్తుశుద్ధి ఉంటే టమాట రైతులకూ మాఫీ ప్రకటించాలనీ డిమాండ్ చే శారు. కడప-బెంగళూరు రైల్వేమార్గం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముం దుకు సాగడం లేదని తెలిపారు. రాజం పేట పార్లమెంటు నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇంది రమ్మ గృహ నిర్మాణాలకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడాదిలో ప్రభుత్వ పనితీరు తెలిపోతుందని అన్నారు. -
రుణమాఫీ చేయకుంటే తిరుగుబాటు తప్పదు
నీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కురబలకోట: రుణమాఫీ చేయకుంటే రాష్ట్రం లో చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. మం డలంలోని తెట్టు, అంగళ్లు, కురబల కోట గ్రామాల్లో ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఏవీ.లక్ష్మిదేవమ్మతో కలసి పర్యటించారు. నీటి సమస్య పరి ష్కారం కోసం కొత్తబోర్లు వేయడానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కాగానే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. రుణమాఫీపై కాకుండా కమిటీపై సం తకం చేసి అందరినీ మభ్య పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేయడం సరికాదన్నారు. నెల రో జుల్లోగా రుణమాఫీ చేయకుంటే జరిగే తిరుగుబాటుకు తమ పార్టీ అండదండగా నిలుస్తుందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల రద్దుపై చేసి తనేమిటో చాటారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్ర రైతాంగంలో రుణమాఫీపై ఆశలు స న్నగిల్లాయన్నారు. ఒకవైపు రాష్ట్రానికి నిధులు లేవని చెబుతూనే మరోవైపు అగ్రస్థానంలో నిలుపుతానని చెప్పడం చూస్తే ఆయన వైఖరిపై జనాలు విస్తుపోతున్నారని అన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చెప్పడం తప్ప ఆ దిశగా చర్యలు కన్పించడం లేదన్నారు. తమ నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సాధ్యాసాధ్యాలను ఊహించే ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి మంచి తనాన్ని, విశ్వసనీయతను జ నం తెలుసుకున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ఏ ప్ర భుత్వం కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్నారు. నీటి సమస్యకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి వర్షాకాలం అయినప్పటికీ పడమటి మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉం దని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రత్యే క నిధులు కేటాయించాలన్నారు. వర్షా లు పడే వరకు ఆదుకోవాల్సి ఉందన్నా రు. తనకున్న నిధులన్నింటినీ తాగునీటికే కేటాయిస్తున్నామన్నారు. మరోవైపు కరువు కాటకాటలతో జనం అల్లాడుతున్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృ ష్టి సారించి ప్రజలకు ఉపశమనం కలి గించాలన్నారు. నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఎంజీ.మల్లయ్య, నుల క చెన్నకేశవరెడ్డి, నులక మనోహర్‌రెడ్డి, పోరెడ్డి విశ్వారెడ్డి, తెట్టు సర్పంచ్ మ ల్లమ్మ, బైసాని జ్యోతి, కురబలకోట స ర్పంచ్ ముస్తఫా, ఎంఆర్ఆర్, బీ.దస్తగిరి, కోళ్లబైలు మాజీ సర్పంచ్ బయ్యారెడ్డి, బైసాని భాస్కర్‌రెడ్డి, ఫజరుల్లా, ముట్ర దామోదర్‌రెడ్డి, ఎన్వీ.రమణారెడ్డి, శిద్దారెడ్డి, పిచ్చలవాండ్లపల్లె గోపి, ఎస్ భానుప్రకాష్తో పాటు యువజన నాయకులు బైసాని హేమచంద్రారెడ్డి, నిశాంత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఈ ఇద్దరిదీ ఎదురీతే
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాజంపేట లోక్‌సభ స్థానంలో ఓ యువ తేజంతో ఇరువురు రాజకీయ ఉద్దండులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష రాజకీయూల్లో పాల్గొనలేదు. ఆయన తండ్రి రాజకీయూల్లో ఉన్నారు. తండ్రి సూచనలు, సలహాలు తీసుకుంటూ భారత పార్లమెంటు మెట్లు ఎక్కేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన పేరు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. యువకుడు, విద్యావంతుడు. తండ్రి రాష్ట్ర మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొదటి నుంచీ రాజకీయ కుటుంబమే. అయితే మిథున్ మాత్రం రాజకీయూలకు కొత్త. ఆయన ప్రసంగం తీరు, యువతను కలుపుకుని పోయే శైలి, జనంతో మమేకమై తిరుగుతున్న తీరును పరిశీలిస్తే ప్రత్యర్థులను మట్టికరిపించడం ఖాయమని స్పష్టమవుతోంది. హేమాహేమీలతో పోరాటం కాంగ్రెస్, బీజేపీ నుంచి హేమాహేమీలైన రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి ఏ.సాయిప్రతాప్, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి రంగంలో ఉన్నారు. ఇరువురూ నామినేషన్లు దాఖలు చేశారు. సాయిప్రతాప్ తలపండిన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన ఇప్పటికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేయలేదు. ఇది ఆయన రాజకీయ పరిణితికి దర్పణంగా చెప్పవచ్చు. సంక్షేమం అంటే వైఎస్ఆర్ను చూసి నేర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయింది. ఈ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే సాయిప్రతాప్ మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఓటమి తప్పదని తెలుసు. డిపాజిట్లు కూడా వస్తాయో రావోననే బాధ ఆయనలో ఉంది. అయినా గాంభీర్యంగా నామినేషన్ వేసి జనం ఏ తీర్పు ఇస్తే దానికి శిరసావహిస్తానని చెప్పారు. మరో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి రాజంపేట ఎటువైపు ఉంటుందో మ్యాప్‌లో చూసి తెలుసుకోవడం తప్ప అక్కడికి వెళ్లి జనంతో మాట్లాడిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల కాలం మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి కాంగ్రెస్ పార్టీ వారు అప్పట్లో వైఎస్ఆర్ను చూసి ఉన్నత స్థానం కల్పించారు. పదవీ వ్యామోహం ఎంత పని చేయిస్తుందో ఈమెను చూసి తెలుసుకోవచ్చు. పదేళ్లు కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరి రానున్న ఐదేళ్లు పదవి లేకుండా ప్రజాసేవ చేయవచ్చు. అయితే బీజేపీలో చేరి ఊహించని విధంగా రాజంపేట స్థానం నుంచి టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. లోక్‌సభ పరిధిలో చిత్తూరు జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు, వైఎస్ఆర్ జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజారిటీని ఇస్తాయి. ఇక వైఎస్ఆర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురందేశ్వరికి లోక్‌సభ పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా తెలియదు. పైగా ఆమె ఈ 15 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో కూడా పాల్గొనే అవకాశం లేదు. అంటే కనీసం జనం ముందుకు కూడా వెళ్లకుండా జనం తమకు ఓట్లేస్తారని భావిస్తే పొరపాటే అవుతుంది. పైగా టీడీపీ వారు పనిగట్టుకుని పురందేశ్వరికి డిపాజిట్లు దక్కకుండా చేయూలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఇరువురు కేంద్ర మాజీమంత్రులు యువకుడైన మిథున్‌రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయం.