రుణమాఫీ చేయకుంటే తిరుగుబాటు తప్పదు
- నీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి
- రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
కురబలకోట: రుణమాఫీ చేయకుంటే రాష్ట్రం లో చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. మం డలంలోని తెట్టు, అంగళ్లు, కురబల కోట గ్రామాల్లో ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఏవీ.లక్ష్మిదేవమ్మతో కలసి పర్యటించారు. నీటి సమస్య పరి ష్కారం కోసం కొత్తబోర్లు వేయడానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కాగానే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు.
రుణమాఫీపై కాకుండా కమిటీపై సం తకం చేసి అందరినీ మభ్య పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చేయడం సరికాదన్నారు. నెల రో జుల్లోగా రుణమాఫీ చేయకుంటే జరిగే తిరుగుబాటుకు తమ పార్టీ అండదండగా నిలుస్తుందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల రద్దుపై చేసి తనేమిటో చాటారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్ర రైతాంగంలో రుణమాఫీపై ఆశలు స న్నగిల్లాయన్నారు.
ఒకవైపు రాష్ట్రానికి నిధులు లేవని చెబుతూనే మరోవైపు అగ్రస్థానంలో నిలుపుతానని చెప్పడం చూస్తే ఆయన వైఖరిపై జనాలు విస్తుపోతున్నారని అన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని చెప్పడం తప్ప ఆ దిశగా చర్యలు కన్పించడం లేదన్నారు. తమ నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యాసాధ్యాలను ఊహించే ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి మంచి తనాన్ని, విశ్వసనీయతను జ నం తెలుసుకున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ఏ ప్ర భుత్వం కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదన్నారు.
నీటి సమస్యకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి
వర్షాకాలం అయినప్పటికీ పడమటి మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉం దని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రత్యే క నిధులు కేటాయించాలన్నారు. వర్షా లు పడే వరకు ఆదుకోవాల్సి ఉందన్నా రు. తనకున్న నిధులన్నింటినీ తాగునీటికే కేటాయిస్తున్నామన్నారు. మరోవైపు కరువు కాటకాటలతో జనం అల్లాడుతున్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృ ష్టి సారించి ప్రజలకు ఉపశమనం కలి గించాలన్నారు.
నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఎంజీ.మల్లయ్య, నుల క చెన్నకేశవరెడ్డి, నులక మనోహర్‌రెడ్డి, పోరెడ్డి విశ్వారెడ్డి, తెట్టు సర్పంచ్ మ ల్లమ్మ, బైసాని జ్యోతి, కురబలకోట స ర్పంచ్ ముస్తఫా, ఎంఆర్‌ఆర్, బీ.దస్తగిరి, కోళ్లబైలు మాజీ సర్పంచ్ బయ్యారెడ్డి, బైసాని భాస్కర్‌రెడ్డి, ఫజరుల్లా, ముట్ర దామోదర్‌రెడ్డి, ఎన్‌వీ.రమణారెడ్డి, శిద్దారెడ్డి, పిచ్చలవాండ్లపల్లె గోపి, ఎస్ భానుప్రకాష్‌తో పాటు యువజన నాయకులు బైసాని హేమచంద్రారెడ్డి, నిశాంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.