రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
Published Thu, Sep 22 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
డోర్నకల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బుధవారం డోర్నకల్‌లో జిల్లా జట్టును ఎంపిక చేశారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని పైకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకపోతుల రమ్య, జడ్పీటీసీ సభ్యురాలు కేశబోయిన స్వరూప, సర్పంచ్ మాదా లావణ్య, పీఏసీఎస్ చైర్మెన్ రాయల వెంకటేశ్వర్‌రావు, ఎంఈఓ మధులత, మండల క్రీడాధికారి ఇమ్మానియల్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్‌జనరల్ సెక్రెటరీ కొత్త రాంబాబు, కో ఆప్షన్ సభ్యులు వాజీద్, ఎస్‌ఎంసీ చైర్మన్ దాసరి నాగేశ్వర్‌రావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ కొత్త కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గొర్ల సత్తిరెడ్డి పాల్గొన్నారు.
బాలుర జట్టు..
48 కేజీల విభాగంలో వి.గణేష్, ఎం వేణు, 56 కేజీల విభాగంలో ఎన్‌రాజేష్, 62 కేజీల విభాగంలో కె.హర్షిత్‌చక్రవర్తి, బి.కార్తీక్, 69 కేజీల విభాగంలో కె.సాయికుమార్, 77 కేజీల విభాగంలో ఎస్‌కె మదార్, 85 కేజీల విభాగంలో జి.గణేష్, ఎస్‌కె మెహరాజ్‌పాషా, ఎండీ అమీర్‌పాషా ఎంపికయ్యారు.
బాలికల జట్టు..
44 కేజీల విభాగంలో వి.వెన్నెల, కె.వైజయంతి, 48 కేజీల విభాగంలో ఎస్ మౌనిక, 53 కేజీల విభాగంలో బి.కావేరి, 58 కేజీల విభాగంలో పి.శ్రావణి, 63 కేజీల విభాగంలో బి.సింధు, 75 కేజీల విభాగంలో బి.అఖిల ఎంపికయ్యారు.
Advertisement