వరంగల్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు.
డోర్నకల్: వరంగల్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల పంచాయతీ కస్నా తండాలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
తండాకు రవీందర్, స్రవంతి దంపతులకు ప్రణీత (5), ప్రణీత్ (3) ఇద్దరు సంతానం. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న పురుగుల ముందును చిన్నారులు తాగారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రవీందర్ దంపతులకు చిన్నారుల నుంచి పురుగుల ముందు వాసన రావడంతో వెంటనే 108 వాహనంలో మహబూబాబాద్ ఆస్పత్రికి పంపించారు. ప్రణీత్ ఎక్కువ మొత్తంలో పురుగుల మందు తాగడంతో బతకడం కష్టమని, ప్రణీత పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.