ప్రతీకాత్మక చిత్రం
డోర్నకల్: మండలంలోని రాముతండా పంచాయతీకి చెందిన బానోతు ప్రశాంత్ గురువారం రాత్రి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఉంటున్న వివాహిత గురువారం రాత్రి స్నానం చేస్తుండగా ప్రశాంత్ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
యువతి అదృశ్యం
మడికొండ: కాజీపేట మండలం కొత్తపెల్లి హవేలికి చెందిన ఇంటర్ విద్యార్థి చిట్యాల శ్రావణి(19) గురువారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. సమీప బంధువులకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment