Married Woman Raped
-
దారుణం: వివాహితపై లైంగిక దాడి
డోర్నకల్: మండలంలోని రాముతండా పంచాయతీకి చెందిన బానోతు ప్రశాంత్ గురువారం రాత్రి ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఉంటున్న వివాహిత గురువారం రాత్రి స్నానం చేస్తుండగా ప్రశాంత్ బాత్రూమ్లోకి ప్రవేశించి అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువతి అదృశ్యం మడికొండ: కాజీపేట మండలం కొత్తపెల్లి హవేలికి చెందిన ఇంటర్ విద్యార్థి చిట్యాల శ్రావణి(19) గురువారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. సమీప బంధువులకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
దారుణం: వివాహితను గదిలో బంధించి..
లక్నో : వివాహితను గదిలో బంధించి అయిదురోజుల పాటు అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. నెల 19న జరిగిన ఈ ఘటన గురించి శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు వివరాలు వెల్లడించారు. బడోహి జిల్లాలోని నివసిస్తున్న ఓ మహిళకు(18) మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయిదు రోజుల క్రితం మహిళ తన అత్తగారి ఇంట్లో ఉందని తెలుసుకున్న ఓ వ్యక్తి అక్కడకి వచ్చి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. ఆనంతరం ఆమెను గదిలో బంధించి బలవంతంగా అయిదు రోజులు అత్యాచారానికి తెగబడ్డాడు. బుధవారం కోడలి తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకోడానికి అత్తమామలు మహిళ పుట్టింటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. తన కూతురు అసలు ఇంటికి రాలేదని తల్లి చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విశాల్ సరోజ్‌గా గుర్తించారు. సరోజ్ బాధితురాలి గ్రామానికే చెందినవాడని పోలీసులు తెలిపారు. గురువారం సరోజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రం మధ్యలోని గదిలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సరోజ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. -
వివాహితపై కాంగ్రెస్ కార్యకర్త అత్యాచారం
అనంతపురం జిల్లా చిలమత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై నర్సింహులు అనే కాంగ్రెస్ కార్యకర్త గత అర్థరాత్రి అత్యాచారం చేశాడు. దాంతో బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నర్సింహులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు.