అనంతపురం జిల్లా చిలమత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై నర్సింహులు అనే కాంగ్రెస్ కార్యకర్త గత అర్థరాత్రి అత్యాచారం చేశాడు. దాంతో బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నర్సింహులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించారు.