విద్యార్థి అదృశ్యం
Published Sat, Aug 27 2016 11:43 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
డోర్నకల్ : స్థానిక ఎస్టీ బాలుర హాస్టల్ విద్యార్థి గుగులోత్ ప్రవీణ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయినట్లు అతడి తండ్రి తెలిపారు. నెల్లికుదురు మండలం రత్తిరాంతండా గ్రామపంచాయతీ పరిధిలోని నల్లగట్టు తం డాకు చెందిన గుగులోత్ హనుమంతు కుమారుడు ప్రవీణ్ డోర్నకల్ ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ అక్కడి గుగులోత్ ప్రవీణ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తండా నుంచి హాస్టల్‌కు వచ్చిన ప్రవీణ్ శుక్రవారం ఉదయం స్కూ ల్‌కు వెళ్లి బ్యాగ్ తరగతి గదిలో పెట్టి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాడు.
సాయంత్రం హాస్టల్‌కు వచ్చిన తోటి విద్యార్థులు ప్రవీణ్ కనిపించకపోవడంతో ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలపడంతోపాటు ప్రవీణ్ తండ్రి హనమంతుకు కూడా ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఈ విషయమై హాస్టల్ సిబ్బందిని వివరణ కోరగా ప్రవీణ్ ఆధార్ కార్డుతో సహా సర్టిఫికెట్లు తెచ్చుకోకపోవడంతో హాస్టల్‌లో చేర్చుకోలేదని నల్లగట్టుతండాకు చెందిన విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో కొద్దిరోజులు మాత్రమే ఉన్నాడని సిబ్బంది చెబుతున్నారు. ప్రవీణ్ కోసం బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదని తండ్రి హనుమంతు ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement
Advertisement