పెండింగ్‌ సమస్యలు పరిష్కరించండి | Pending Issues do clear | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించండి

Published Sun, Sep 4 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

Pending Issues do clear

  • రైల్వే జీఎంను కలిసిన ఎంపీ సీతారాంనాయక్‌
  • హన్మకొండ :  దక్షిణ మధ్య రైల్వే జీఎం రవిగుప్త ను మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ కలిశారు. ఈ మేరకు శనివారం ఆయన సికింద్రాబాద్‌లో జీఎంను కలిసి రైల్వే పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డోర్నకల్‌ రైల్వే స్కూల్‌ను తిరి గి ప్రారంభించాలని కోరారు. డోర్నకల్‌కు మం జూరు చేసిన సరుకుల రైలు ఎగ్జామినేషన్‌ ఫెసిలి టీ కేంద్రం పనులను వెంటనే ప్రారంభించాల న్నారు. అలాగే అండర్‌ బ్రిడ్జిని మంజూరు చేయాలన్నారు. నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించిన మహబూబాబాద్‌లో రఫ్తిసాగర్‌(125/2), నర్సాపూర్‌–నాగర్‌సోల్‌ (17213/14), డోర్నకల్‌ వద్ద పద్మావతి (12763/64), ఈస్ట్‌ కోస్ట్‌ (13645/46) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని కోరారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, వైజాగ్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైళ్లలో ఒక రైలును నెక్కొండ వద్ద ఆపాలన్నారు. గోరఖ్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు (12511/12), శాతవాహన, ఇంటర్‌సిటీ, జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో ఏదైనా ఒక రైలు నెక్కొండలో హాల్ట్‌ చేసేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో డోర్నకల్‌–ఇల్లందు వరకు నడిచిన ప్యాసింజర్‌రైలును పునరుద్ధరించాలని కోరారు. కాగా, వీటిపై జీఎం రవిగుప్తా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement