
ఎండలు బాబోయ్
సోమవారం 40నిఛి ఉష్ణోగ్రత
- నడివేసవిని తలపిస్తున్న వాతావరణం
- అల్లాడిపోతున్న జనం
విజయవాడ : నగరంలో ఎండలు నడివేసవిని తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చి ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో నగరవాసులు అల్లాడిపోయారు. వడగాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికితోడు ఉక్కపోత కూడా తోడవడంతో చిన్నారులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడిమి ఉధృతంగా ఉంటోంది. సోమవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ట, 26.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు అత్యవసర పనులుంటేనే బయటకు వస్తున్నారు.