ఎండలు ఇంకా చంపుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడా చిరుజల్లులు కురియగా,
నెట్‌వర్క్: ఎండలు ఇంకా చంపుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడా చిరుజల్లులు కురియగా, శనివారం మళ్లీ వాతావరణం వేడెక్కడంతో మరణాలు పెరిగాయి. శనివారం ఒక్కరోజే తెలంగాణవ్యాప్తంగా మొత్తం 165మంది వడదెబ్బతో చనిపోయారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాకు చెందిన వారే 44 మంది ఉన్నారు. అలాగే, కరీంనగర్ జిల్లాలో 36 మంది, ఖమ్మం జిల్లాలో 22 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది, నిజామాబాద్‌లో ఐదుగురు చనిపోయారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు మెదక్ జిల్లాలో 15 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, నల్లగొండ జిల్లాలో 20 మంది, హైదరాబాద్‌లో నలుగురు మరణించారు.
ఏపీలో 134 మంది
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వడదెబ్బ మృతుల సంఖ్య తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 134 మంది మరణించారు నెల్లూరు జిల్లాలో 24 మంది, విశాఖపట్నంలో 24, పశ్చిమగోదావరి 15, చిత్తూరు 15, తూర్పు గోదావరి 11, గుంటూరు 10, విజయనగరం 09, ప్రకాశం 7, అనంతపురం 7, వైఎస్సార్ కడప 5, శ్రీకాకుళం 3, కృష్ణా 3, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు