![చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41499132749_625x300.jpg.webp?itok=YZ3n6xdM)
చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయ్
బంజారాహిల్స్: చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం ఫిలించాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి హాజరై మాట్లాడుతూ సినిమా పరిశ్రమ పెట్టుబడిదారుల మయం అయిపోయిందని, వారి ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. వాళ్ల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయన్నారు.
థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యం కొనసాగుతుందని దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని తగిన విధంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయి వెంకట్, కవిత, అన్నపూర్ణమ్మ, రమ్యశ్రీ, బల్లెపల్లి మోహన్, వట్టికుమార్, శ్రీలక్ష్మి, పీఎన్.రాంచందర్‌రావు, వాసిరాజు ప్రకాశం, జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.