సమాజానికి ఉపయోగపడే సినిమా | Swecha Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

సమాజానికి ఉపయోగపడే సినిమా

Published Fri, Feb 21 2020 12:25 AM | Last Updated on Fri, Feb 21 2020 12:25 AM

Swecha Movie Trailer Launch - Sakshi

రాజు నాయక్, మంగ్లీ, బోలే

‘‘పక్షులకు దేవుడు రెక్కలిచ్చింది అవి స్వేచ్ఛగా ఎగరాలని.. వాటిని పంజరంలో పెట్టకూడదు. ఆడపిల్లలకూ అలాంటి స్వేచ్ఛనివ్వాలి. పురుషులకు సమానంగా ఆడపిల్లలను కూడా చదివిస్తే వారు ఏ రంగంలో అయినా రాణిస్తారు’’ అన్నారు గాయని, నటి మంగ్లీ. కెపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వంలో మంగ్లీ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘స్వేచ్ఛ’. రాజు నాయక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రదర్శించారు. మంగ్లీ మాట్లాడుతూ– ‘‘మా బంజారా కులంలో జరిగే కథాంశంతో స్ఫూర్తినిచ్చే సినిమా తీశారు చౌహాన్‌.

సమాజానికి ఎంతో ఉపయోగపడే చిత్రమిది. సినిమాలో ఒక అమ్మాయిని వాళ్ల నాన్న అమ్మేస్తాడు.. ఆమె బాగా చదువుకుని వచ్చి ఆ ఊరిని బాగు చేస్తుంది. మా సినిమాని అందరూ ఆదరించాలి’’ అన్నారు. ‘‘గోర్‌ జీవన్‌’ పేరుతో బంజారా భాషలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.. దీంతో తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు రాజు నాయక్‌. ‘‘గోర్‌ జీవన్‌’ అనే సినిమా బంజారా బాహుబలి. బంజారా భాషలో ఇంత పెద్ద సినిమా లేదు. మహిళలు, వారి స్వేచ్ఛ గురించి తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు  బోలే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement