
VJ Sunny Emotional In Sakala Gunabhi Rama Trailer Launch: బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రేజ్‌తోనే హీరోగా మారాడు. వీజే సన్నీ నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ అతిథిగా రావడంతో వీజే సన్నీ ఎమోషనల్ అయ్యాడు. తాను బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు విశ్వక్ సేన్ ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు సన్నీ. 'నేను బిగ్‌బాస్ టైటిల్ కొట్టడానికి కారణం నా స్నేహితులే. వాళ్లే నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు. జీవితంలో కావాల్సింది పైసల్ కాదు. దోస్తులు కావాలి. నా దోస్తులందరికీ నేను హీరో కావాలనే కల ఉండేది. ఆ కలను ఈ చిత్రంతో నిజం చేశాను.
ఈ కార్యక్రమానికి పిలవగానే విశ్వక్ సేన్ అన్న, అనిల్ అన్నా వచ్చారు. నేను బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు విశ్వక్ సేన్‌కు నేను ఎవరో తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారని బయటకు రాగానే నా స్నేహితులు చెప్పారు. విశ్వక్ సేన్ అన్న ఎంత సపోర్ట్ చేశారో.. అనిల్ రావిపూడి అన్న అంతే సపోర్ట్ చేశారు. నేను బయటకు రాగానే అన్నని కలిశాను. వాళ్ల డాటర్ కేక్ కట్ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా. థాంక్యూ అన్నా.' అని తెలిపాడు వీజే సన్నీ.