Vishwak Sen team up with director Krishna Chaitanya for his next - Sakshi
Sakshi News home page

Vishwak Sen: పీరియాడికల్‌ నేపథ్యంలో విశ్వక్‌ కొత్త సినిమా.. డైరెక్టర్‌ ఎవరంటే..

Published Thu, Mar 30 2023 8:28 AM | Last Updated on Thu, Mar 30 2023 11:24 AM

Vishwak Sen Team Up With Director Krishna Chaitanya For a Movie - Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. బుధవారం (మార్చి 29) విశ్వక్‌ సేన్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్‌.

‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్‌ ఉండదు, వైట్‌ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ వీడియో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనున్న పీరియాడిక్‌ ఫిల్మ్‌ ఇది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం యువన్‌ శంకర్‌ రాజా అందించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement