విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం | Acharam different love story | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం

Published Sun, Apr 6 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం

విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం

 సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సహజత్వంతో కూడిన చిత్రాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి విభిన్న ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అచ్చారం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తరుణ్ క్రియేషన్స్ పతాకంపై జ్ఞాన దేశ్ అంబేద్కర్ నిర్మిస్తున్నారు. గణేశ్ వెంకట్రామన్ మున్న హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూనం కౌర్ హీరోయిన్.
 
 ఇతర ముఖ్య పాత్రల్లో రేఖ, రాజ్యలక్ష్మి, ఓ.ఎ.కె.సుందర్, ఐశ్వర్యదత్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత జ్ఞానదేశ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఇద్దరు యువకులు ఒక యువతి మధ్య జరిగే లవ్, రొమాన్స్, థ్రిల్లర్ కథా చిత్రం అచ్చారం అని తెలిపారు. వీరిలో ఒక యువకుడు ఇన్నోసెంట్ అయితే మరొకరు భిన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారన్నారు.
 
 అలాంటి ఈ ఇద్దరు హీరోయిన్‌కు సంబంధం ఏమిటన్నది చిత్రంలో ప్రధానాంశం అన్నారు. ఇన్నోసెంట్ హీరో పాత్రను మున్నా వింత మనస్తత్వం గల హీరో పాత్రను గణేశ్ వెంకట్రామన్  పోషిస్తున్నారని హీరోయిన్ పూనం కౌర్ పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుందని చెప్పారు. మూడు దశల్లో జరిగే ఈ చిత్ర షూటింగ్‌ను కొడెక్కైనాల్, చెన్నై, తంజావూరులో పూర్తి చేసినట్లు తెలిపారు. అచ్చారం కమర్షియల్ అంశాలతో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement