mohana krishna
-
రైతుల నేపథ్యంలో...
మోహన కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా, ఓ ప్రధాన పాత్రలో సుమన్ నటించిన చిత్రం ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్’. శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్‌రావు నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ– ‘‘రైతులను ఇబ్బంది పెడుతున్న ఓ బర్నింగ్ ఇష్యూపై నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘రైతులు, స్నేహం, రాజకీయం.. అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మోహన కృష్ణ. ‘‘రైతు గురించి మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం’’ అన్నారు శ్రీ లక్ష్మణ్. -
కొడుకును అలా చూసి అల్లాడిపోయిన తారకరత్న తల్లిదండ్రులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ముదురుతున్న ‘గ్యాంగ్ లీడర్’ వివాదం
నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌తో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్‌లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్‌ను ఎలా ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు. -
రొమాంటిక్.. థ్రిల్లింగ్.. హీరో
విజయాలు చాలామందికి వస్తాయి. కానీ, ఆ విజయాల కోసం సాగించే ప్రయాణం కూడా ఆహ్లాదంగా, వైవిధ్యంగా ఉండడం కొందరికే సాధ్యం. యువ హీరో నాని... ఇప్పుడు ఇలా విజయాలతో పాటు ఆ ప్రయాణమూ ఆహ్లాదంగా ఉండేలా చూసుకొంటున్న కొద్దిమంది నటుల్లో ఒకరు. మధ్యలో కొంత జోరు తగ్గినట్లనిపించినా, సహజమైన నటనతో, యువతరానికి బాగా దగ్గరై, వరుసగా మూడు విజయాలతో ఊపు మీద ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, తాజాగా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ - మూడూ వైవిధ్యభరిత కథలు, పాత్రలే! ఈ వైవిధ్యానికీ, సక్సెస్ లకూ తగ్గట్లే మరో కొత్త చిత్రంతో సిద్ధమవుతున్నారు. గతంలో ‘అష్టాచమ్మా’ ద్వారా కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. ‘చిన్నోడు - పెద్దోడు’తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. సురభి, నివేదా థామస్‌లు హీరోయిన్లు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడంతో, ఈ చిత్రంలో నాని లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘‘ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్‌కు గురి చేసే అంశాలు, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం - ఇలా అన్నీ ఈ కథలో కుదిరాయి’’ అన్నారు. డేవిడ్ నాథన్ కథ అందించగా, మోహనకృష్ణ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. మణిశర్మ బాణీలకు సీతారామశాస్త్రి, రామ జోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్ సాహిత్యం సమకూరుస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేశ్ తదితరులు పాత్రధారులు. పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్‌ల నిర్మాణ నిర్వ హణలో డిసెంబర్ 2న మొదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగైంది. ‘‘ఇప్పటికి 40 శాతం పూర్తయింది. ఈ 22 నుంచి మార్చి 6 వరకు కొడెకైనాల్లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తున్నాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తి అవుతుంది’’ అని కృష్ణప్రసాద్ తెలిపారు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని మే చివరి వారానికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నం. నాని కూడా ‘అష్టాచమ్మా’తో తనను తీర్చిదిద్దిన ఇంద్రగంటి, సహనటుడు అవసరాల శ్రీనివాస్‌లతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. బర్త్‌డే బాయ్ లుక్... యూనిట్‌లోని నట, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తుంటే, నాని సక్సెస్ట్రాక్లో ముందుకు సాగడం ఖాయమే! -
అందరి చూపు సీబీసీఐడీ వైపు!
టీడీఎన్ మోహనకృష్ణ కేసు బదలాయింపు 552 మంది బాధితులు రూ. 8 కోట్లకు టోకరా అవనిగడ్డ : దివిసీమలో సంచలనం సృష్టించిన చిట్టీపాటల కుంభకోణం కేసులో నిందితుడైన టీడీఎన్ మోహనకృష్ణ కేసును జిల్లా ఎస్పీ సూచనల మేరకు సీబీసీఐడీకి బదిలీ చేయడం దివిసీమలో సర్వత్రా చర్చనీయాంశమైంది. 1990 ఏప్రిల్ 16వ తేదీన వేకనూరులో జరిగిన ఐదు హత్యలకేసును సీబీసీఐడీకి అప్పగించిన దరిమిలా మరలా ఈ ప్రాంతానికి చెందిన కేసును సీబీసీఐడీకి అప్పగించటం ఇదే. చిట్టీపాటల పేరుతో కోట్లాది రూపాయలు వసూలుచేసి టీడీఎన్ అదృశ్యం కావడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అవనిగడ్డలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులను, జిల్లా ఎస్పీని కలసి విన్నవించారు. అదృశ్యమైన రెండు వారాల తర్వాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీఎన్ మచిలీపట్నం కోర్టులో లొంగిపోయాడు. ఆ దరిమిలా నాటి సీఐ ఎన్.సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసు కస్టడీ పిటీషన్ వేయడంతో మూడు రోజులపాటు టీడీఎన్ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మూడు రోజుల వ్యవధిలో పోలీసులు టీడీఎన్ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. టీడీఎన్ ఆస్తులన్నీ ఆయన భార్య పేరిట ఉండడంతో ఆమెను సైతం పోలీసులు అరెస్టు చేశారు. టీడీఎన్ కుమార్తె కార్యక్రమానికి సంబంధించి ఆమెను నాలుగు రోజులపాటు బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల విచారణలో టీడీఎన్ ఇచ్చిన సమాచారం మేర రూ.70లక్షలు ఆయనకు చిట్టీపాటల రూపంలో బకాయిలు రావల్సి ఉండగా మరో రూ.70లక్షలు ఈయన ఇతర ఫైనాన్సర్లకు చెల్లించాలని లెక్క తేల్చారు. చిట్టీపాటల బాధితుల్లో 552మందికి సుమారు రూ.8కోట్లకుపైగా చెల్లించాల్సి వచ్చినట్లు లెక్కతేలింది. సంబంధిత చిట్టీపాటల బాధితుల పేర్లు, వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని నాటి ఎస్ఐ వెంకటకుమార్ రికార్డు చేశారు. టీడీఎన్కు ప్రస్తుతం కండీషన్ బెయిల్ లభించింది. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు అవనిగడ్డ పోలీసుస్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది. కాగా ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే ఆయన బినామీలుగా ఉన్నవారి ఆస్తులు వెలుగులోకి వస్తాయన్న భావనతో ఉన్నారు. టీడీఎన్ పాటదారులకు చెల్లించాల్సిన బకాయిలను, ఆయన ఆస్తులను బేరీజు వేసుకుంటే రూపాయికి 30పైసలు వంతున వచ్చే అవకాశం కూడా లేదు. విషయం తెలిసిన బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీఎన్కు బెయిల్ వచ్చినప్పటికీ కేసును సీబీసీఐడీకి అప్పగించడంతో సంబంధిత అధికారులు మళ్లీ ప్రశ్నించనున్నట్లు తెలియవచ్చింది. -
విభిన్న ప్రేమ కథా చిత్రంగా అచ్చారం
సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సహజత్వంతో కూడిన చిత్రాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి విభిన్న ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న చిత్రం అచ్చారం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తరుణ్ క్రియేషన్స్ పతాకంపై జ్ఞాన దేశ్ అంబేద్కర్ నిర్మిస్తున్నారు. గణేశ్ వెంకట్రామన్ మున్న హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూనం కౌర్ హీరోయిన్. ఇతర ముఖ్య పాత్రల్లో రేఖ, రాజ్యలక్ష్మి, ఓ.ఎ.కె.సుందర్, ఐశ్వర్యదత్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత జ్ఞానదేశ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఇద్దరు యువకులు ఒక యువతి మధ్య జరిగే లవ్, రొమాన్స్, థ్రిల్లర్ కథా చిత్రం అచ్చారం అని తెలిపారు. వీరిలో ఒక యువకుడు ఇన్నోసెంట్ అయితే మరొకరు భిన్న వ్యక్తిత్వం కలిగి ఉంటారన్నారు. అలాంటి ఈ ఇద్దరు హీరోయిన్‌కు సంబంధం ఏమిటన్నది చిత్రంలో ప్రధానాంశం అన్నారు. ఇన్నోసెంట్ హీరో పాత్రను మున్నా వింత మనస్తత్వం గల హీరో పాత్రను గణేశ్ వెంకట్రామన్ పోషిస్తున్నారని హీరోయిన్ పూనం కౌర్ పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుందని చెప్పారు. మూడు దశల్లో జరిగే ఈ చిత్ర షూటింగ్‌ను కొడెక్కైనాల్, చెన్నై, తంజావూరులో పూర్తి చేసినట్లు తెలిపారు. అచ్చారం కమర్షియల్ అంశాలతో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు పేర్కొన్నారు.