నటి పూనమ్ కౌర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.
పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో రాస్తూ.. కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏపీలో జరిగిన ఎన్నికల గురించే పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024
Comments
Please login to add a commentAdd a comment