ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి : పూనమ్‌ కౌర్‌ | Poonam Kaur Clarity On Having Two Kids In Viral Photo | Sakshi
Sakshi News home page

Poonam Kaur: పూనమ్‌ కౌర్‌కు ఇద్దరు పిల్లలున్నారా? ఆమె ఏమందంటే..

Published Thu, May 5 2022 11:32 AM | Last Updated on Thu, May 5 2022 2:35 PM

Poonam Kaur Clarity On Having Two Kids In Viral Photo - Sakshi

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్‌ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోపై తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో ఫోటో దిగిన పూనమ్‌ దీనికి హ్యాపీనెస్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్‌ వైరల్‌గా మారి పూనమ్‌కు పెళ్లయి, పిల్లలున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి.

తాజాగా ఈ వార్తలపై పూనమ్‌ కౌర్‌ స్పందించింది. 'ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ చాలు, వాళ్లు నా బెస్ట్‌ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్. నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి' అంటూ పూనమ్‌ ట్వీట్‌ చేసింది. దీంతో పుకార్లకు చెక్‌ పెట్టినట్లయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement