శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు | heroine poonam kaur performs rahu ketu puja at srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు

Published Thu, Apr 2 2015 2:23 PM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు - Sakshi

శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు

'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్కు పరిచయమై.. తర్వాత నాగార్జున సరసన 'గగనం' సినిమాలో చేసి ప్రస్తుతం కోలీవుడ్లో మాంచి బిజీగా కనిపిస్తున్న పూనమ్ కౌర్.. తనకున్న దోషాలను తొలగించుకోడానికి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించిందట. తెలుగులో ఆమెకు పెద్ద ఆఫర్లు రాకపోయినా.. అడపాదడపా ఏవో ఒకటి చేస్తూనే ఉంది. ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, గణేశ్ జస్ట్ గణేశ్, నాగవల్లి, పయనం, బ్రహ్మిగాడి కథ.. ఇలా పలు సినిమాల్లో ఆమె నటించినా ఇక్కడ పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తన హవా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో 'రణం' అనే సినిమాలో నటిస్తున్న ఆమె.. అందులో ఒక్క పాట కోసం ఏకంగా 400 కాస్ట్యూమ్స్‌ని మార్చింది. ఇప్పటి వరకూ తమిళంలో ఏ హీరో/ హీరోయిన్ ఇలా చేయ్యకపోవడంతో ఇదొక రికార్డని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement