
Poonam Kaur Intresting Comments On Prabhas: నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి భామ తాజాగా ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. మార్చి 10న ఈ మూవీ అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పూనమ్ వరస ఇంటర్య్వూలతో బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
చదవండి: రాధికను టిల్లు నమ్మలేదు.. కానీ మీరు నమ్మారు: హీరోయిన్
పరిశ్రమలో ప్రభాస్ లాంటి వ్యక్తి ఎవరూ లేరంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ‘సినీ పరిశ్రమలో స్టార్స్, యాక్టర్స్ అనేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు. ఆయన మంచి వ్యక్తి. ప్రభాస్ లుక్స్, క్రేజ్ పక్కన పెడితే.. నమ్మిన వాళ్ల కోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్’ అంటూ డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించింది పూనమ్.
చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కాగా ఇటీవల కాలంతో పలువురు ప్రముఖలపై సోషల్ మీడియాల్లో పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వివాదంలో నిలిచే పూనమ్ ఇలా ప్రభాస్‌పై ప్రశంస వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ గురించి మాట్లాడుతూ.. తనకు ప్రేమ కథలు, సినిమాలు అంటే ఇష్టమని, అలాగే 'రాధే శ్యామ్' కూడా తనకు నచ్చుతుందని పూనమ్ పేర్కొంది.