ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. దీంతో నెల రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40
రాధేశ్యామ్ ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! అయితే కేవలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనే రాధేశ్యామ్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. మీ కామెంట్లకు సమాధానం దొరికినట్లే.. రాధేశ్యామ్ హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 4 నుంచి స్ట్రీమింగ్ అవనుందని ట్వీట్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో మిస్ అయిన హిందీ ఆడియన్స్ ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చని సంతోషిస్తున్నారు.
YOUR COMMENTS HAVE FINALLY BEEN ANSWERED! Radhe Shyam (Hindi) is arriving on Netflix on 4th May 🥳 pic.twitter.com/vPXq2hrXLX
— Netflix India (@NetflixIndia) April 29, 2022
చదవండి: ఖాన్, కుమార్ చిత్రాలు తిరస్కరించా.. అందుకు అలా చూసేవారు: కంగనా
Comments
Please login to add a commentAdd a comment