టాలీవుడ్ హీరోయిన్, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పుడో ఏదో విషయంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆమె ఓ లేఖ విడుదల చేశారు. రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదని అన్నారు. కొందరు కావాలనే వారి సొంత ప్రయోజనాల కోసం ఓ పావుగా వాడుకోవాలని చూస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
(ఇది చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్)
లేఖలో పూనమ్ కౌర్ రాస్తూ.. 'నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. వీటి ద్వారా మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు. ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నా. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నా. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తా.' అని అన్నారు.
(ఇది చదవండి: మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?)
Comments
Please login to add a commentAdd a comment