విశాఖతో ప్రేమలో పడ్డా..! | i love vizag city | Sakshi
Sakshi News home page

విశాఖతో ప్రేమలో పడ్డా..!

Published Wed, May 3 2017 1:14 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

విశాఖతో  ప్రేమలో పడ్డా..! - Sakshi

విశాఖతో ప్రేమలో పడ్డా..!

ఈ నగరాన్ని మొదటిసారి చూసినప్పుడే ముచ్చటపడ్డా.. దానితో ప్రేమలో పడిపోయానని సినీ నటి పూనం కౌర్‌ అన్నారు

ఈ నగరాన్ని మొదటిసారి చూసినప్పుడే ముచ్చటపడ్డా.. దానితో ప్రేమలో పడిపోయానని సినీ నటి పూనం కౌర్‌ అన్నారు. అందుకే వేసవిని గడపడానికి నాలుగు రోజులుగా ఇక్కడే మకాం వేశానని చెప్పుకొచ్చారు. వినాయకుడు, గగనం, ఆడు మగాడ్రా బుజ్జి, పొగ, నాయకి తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా తనకు వస్తున్న చాన్స్‌ల గురించి, ఇష్టాల గురించి మాట్లాడారు. ‘విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టం. మొదటిసారి ఇక్కడికి వచ్చి ఈ సిటీతో ప్రేమలో పడిపోయాను.’ అన్నారు పూనమ్‌. ప్రస్తుతం వేసవి కావటంతో విశాఖ అందాలను చూడ్డానికి నాలుగు రోజులుగా కుటుంబంతో వచ్చినట్టు చెప్పారు. ‘అమ్మానాన్నలతో వైజాగ్‌ రావడం చాలా బాగుంది. అరకు, బొర్రా గుహలు చూశాం.’ అని చెప్పారు.
తెలుగమ్మాయిలకు

చాన్సులు తక్కువే..
‘టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువే. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు తెలుగు అమ్మాయిలను అంతగా ప్రోత్సహించరు. అందుకే ఫీల్డ్‌లో తెలుగు అమ్మాయిలు అంతగా కనిపించరు.’ అని అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా తనకు తెలుగు సినిమాల్లో అవకాశాలు తక్కువగా వస్తున్నాయన్నారు.  ఏడాదిగా రెండు హిందీ సినిమాలు చేస్తున్నానని, త్వరలోనే అవి విడుదల కానున్నాయని తెలిపారు. ‘పవన్‌కళ్యాణ్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక సినిమా చేయాలని ఉంది. ఆ అవకాశం వస్తే సో లక్కీ.’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement