గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్‌ కౌర్‌ | Poonam Kaur Demands Justice For Geethanjali | Sakshi
Sakshi News home page

గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ కోసం అడుక్కోలేదు: పూనమ్‌

Published Tue, Mar 12 2024 7:04 PM | Last Updated on Wed, Mar 13 2024 2:19 PM

Poonam Kaur Demands Justice For Geethanjali - Sakshi

టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్‌సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్‌ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్‌ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్‌ కౌర్‌ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది. అలాగే  ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది.

గీతాంజలికి న్యాయం జరగాలి
‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది.

అవన్నీ పుకార్లు మాత్రమే
సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్‌ అయ్యారు పూనమ్‌ కౌర్‌. పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌లపై ఆమె చేసే ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్‌ మాత్రమే. అందుకే పవన్‌ ఫ్యాన్స్‌ ఆమెను ట్రోల్‌ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్‌ చేసిందని ప్రచారం చేశారు.

(చదవండి: సోషల్‌ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?)

తాజాగా దీనిపై స్పందించింది పూనమ్‌ కౌర్‌. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్‌ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement