
సెల్ఫీ.. ఫైట్ క్యాన్సర్
అపోలో హాస్పిటల్ ‘లెట్స్ బీ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్.. ఫైట్ క్యాన్సర్’ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంపెయిన్ నిర్వహించింది
అపోలో హాస్పిటల్ ‘లెట్స్ బీ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్.. ఫైట్ క్యాన్సర్’ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంపెయిన్ నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి పూనమ్‌కౌర్ హాజరయ్యారు. పలు కాలేజీలకు చెందిన విద్యార్థినులు గులాబి రంగు దుస్తుల్లో వచ్చి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా యువతులు, చిన్నారులతో పూనమ్‌కౌర్ సెల్ఫీ ఫొటోలు దిగుతూ మురిపించింది.