
సాక్షి, హైదరాబాద్: జోడో యాత్రలో సినీనటి పూనమ్ కౌర్ సందడి చేశారు. వన్‌టౌన్ చౌరస్తా సమీపంలో రాహుల్‌తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరవత్రి అనిల్, ఆలిండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్యతో కలిసి చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన 5శాతం జీఎస్టీ ఎత్తివేయాలని, నేతకు సంబంధించిన ముడి సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని,ఈ మేరకు పార్లమెంట్‌లో మాట్లాడాలని కోరగా.. రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
సీతక్క, భట్టి, కళాకారులతో రాహుల్ దరువు
భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని అవంతి హోటల్ వద్ద ఖమ్మం తదితర జిల్లాలకు చెందిన ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము, కోయ నృత్యాలను రాహుల్ ఆసక్తిగా తిలకించారు. కేసీ వేణుగోపాల్, భట్టి, సీతక్క, సంపత్ కుమార్, కళాకారులతో కలిసి లయబద్ధంగా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆదివాసీల కళారూపాల గురించి రాహుల్‌కు భట్టి విక్రమార్క వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment