
నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి నటి.. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ ఆమె ఇటీవల ఓ ట్వీట్ చేయగా అది చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా పూనమ్ చేసిన మరో ట్వీట్ సంచలనంగా మారింది. తన ఫొటోలు కొన్ని షేర్ చేస్తూ దానికి ‘పీకేలవ్’(#PKlove) అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. దీంతో పూనమ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్థం ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని ఊహగానాలు రెకిస్తున్నట్లుగా ఉన్న ఆమె ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
చదవండి: నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా: పూనమ్ కౌర్
ఇందులో ఇంకేదో ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ మధ్య చోటుచేసకున్న కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ మధ్య ఆమె చేసే ప్రతి పోస్ట్ చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చిత్ర పరిశ్రమలో నా ఏకైక గురువు దాసరి నారాయణ రావు. ఆయనను చాలా మిస్సవుతున్నారు. దాసరి గారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నా. దేవుడు దీనిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
చదవండి: ChaySam: అఫైర్స్ అబార్షన్ రూమార్స్‌పై స్పందించిన సమంత
#pklove pic.twitter.com/SsnBORfjLW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021