
'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవా
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే బొమ్మ బ్లాక్‌బస్టరే! వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ఆదరణ పొందాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో ఓ సినిమా వస్తోంది. అదే గుంటూరు కారం.. రిలీజ్‌కు ముందే మంటెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
ఆ విషయంలో సమర్థుడు
అయితే ఈ సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్‌గా రాసుకోలేదని, యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను కాపీ కొట్టాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. 'ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తన తప్పుడు పనులు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తపడే నైపుణ్యం ఉన్నవాడు. కొందరు గుడ్డిగా ఆయన్ను నమ్మేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం బాగా సాయం చేసింది. అదెందుకో నాకిప్పటికీ అర్థం కాదు మరి' అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
చివరగా సినిమాలో కనిపించింది అప్పుడే!
ఈ ట్వీట్‌కు గురూజీ థింగ్స్ అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఇకపోతే మాయాజాలం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం ఇలా అనేక చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది.
చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో