![Poonam Kaur Clarifies Why Rahul Gandhi Held Her Hand At Jodo Yatra - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/30/Poonam-Kaur.jpg.webp?itok=y_Wn57Dc)
రాహుల్ గాంధీ, పూనమ్‌కౌర్ ఫోటోపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నటి పూనర్ కౌర్ పాల్గొన్న విషయం తెలిసిందే. చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చేనేత చీరలో మెరిసిపోతూ రాహుల్ చేతిలో చేయి వేసి పట్టుకొని కొద్ది దూరం నడిచారు. అయితే యాత్రలో నడుస్తుండగా రాహుల్‌తో పూనమ్‌కౌర్ చేయిపట్టుకున్న ఫోటోపై చర్చ నడుస్తోంది. పూనమ్ కౌర్ చేయిపట్టుకొని రాహుల్ గాంధీ నడవడంపై పలువురు ట్రోల్ చేస్తున్నారు.
This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti - I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022
తాత అడుగు జాడల్లో నడుస్తున్నాడని బీజేపీ నేత ప్రీతి ట్వీట్ చేశారు. దీనిపై వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తున్నారు. మోదీ మహిళలతో ఉన్న ఫోటోలను రీట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించారు. ‘ఇది నిన్ను నువ్వే తక్కువగా చేసుకుంటున్నట్టుగా ఉంది. మన ప్రధాని నారీ శక్తి గురించి చెబుతుంటారు కాదా. నేను జారిపడబోతుంటే రాహుల్ గాంధీ నాచేయిపట్టుకున్నారు’ అని పూనమ్ కౌర్ వివరణ ఇచ్చారు.
చదవండి: డ్రగ్స్ నిషా.. రెండురోజులు లేవలేదు, ఇంట్లోవాళ్లు ఒకటే ఏడుపు!
Comments
Please login to add a commentAdd a comment