Poonam Kaur Controversial Comments On Guruvu In Her Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Poonam Kaur Comments On Guruvu: జీవితాలతో ఆడుకునే వాడిని అలా పిలవద్దు

Published Tue, Jul 4 2023 10:58 AM | Last Updated on Tue, Jul 4 2023 12:35 PM

Poonam Kaur Viral Comments On Guruvu - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌  పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, గవర్నర్‌ తమిళిసై ముందే కంటతడి పెట్టారు. తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్‌ కామెంట్లు అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. అవి మరిచిపోక ముందే సోషల్‌ మీడియాలో మరో పోస్ట్‌ చేశారు.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..)

తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. 'మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని... నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు 'గురువు' కాదు, మీకు దారి చూపించేవారు 'గురువు' అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు.' అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలిస్తున్నారు..? అంటూ పూనమ్‌ పోస్ట్‌పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గతేడాదిలో 'నాతిచరామి' అనే చిన్న సినిమాలో నటించారు. ప్రస్థుతానికి  పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉన్నారు.


(ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement