Guru poornima
-
కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే...
పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు. ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చు. -
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ఈరోజు(ఆదివారం) గురుపౌర్ణమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేడుకలు నిర్వహిస్తున్నారు. యూపీలోని వారణాసికి పెద్దసంఖ్యలో చేరుకున్న భక్తులు గంగాఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అధికార యంత్రాంగం ఘాట్ల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేసింది. యూపీలోని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీర్జాపూర్, ఘాజీపూర్, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సనాతన సంప్రదాయంలో గురుపౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయిబాబా కొలువైన మహారాష్ట్రలోని షిర్డీలో జరుగుతున్న గురుపౌర్ణమి వేడుకలకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గురుపౌర్ణమి సందర్భంగా సాయినగరి షిర్డీ భక్తులతో కిటకిటలాడుతోంది. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయిబాబా సంస్థాన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. శనివారం తెల్లవారుజామున కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తరువాత సాయి జీవిత చరిత్ర పుస్తకాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజంతా సాయి మందిరాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచనున్నారు. -
'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, గవర్నర్ తమిళిసై ముందే కంటతడి పెట్టారు. తెలంగాణాలో పుట్టిన బిడ్డనని.. ఇక్కడే పెరిగానంటూ ఈ బ్యూటీ చేసిన వైరల్ కామెంట్లు అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అవి మరిచిపోక ముందే సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. గురుపూర్ణిమ సందర్భంగా ఇలా షేర్ చేశారు. 'మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని... నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు 'గురువు' కాదు, మీకు దారి చూపించేవారు 'గురువు' అవుతారు. గురువు మీ శ్వాస కావచ్చు, మీ హృదయ స్పందన కావచ్చు లేదా మీ విముక్తి కావచ్చు.' అని ఆమె రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి రాశారు..? ఎవరికి సలహాలిస్తున్నారు..? అంటూ పూనమ్ పోస్ట్‌పై రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గతేడాదిలో 'నాతిచరామి' అనే చిన్న సినిమాలో నటించారు. ప్రస్థుతానికి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి) -
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు అభిషేకాలు. అర్చనలు నిర్వహించారు. భజనలు చేశారు. హరతీ కార్యక్రమం నిర్వహించారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్న ఆలయాలు సాయినామస్మరణంతో మారుమ్రోగాయి. పల్నాడు జిల్లా : అమరావతి శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. విశాఖలో వైభవంగా గురు పౌర్ణమి పూజలు విశాఖ జిల్లాలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. షిరిడి సాయి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి షిరిడి సాయినాథునికి పవిత్ర జలాలతో అభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా: గురు పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 1500 కిలోలు వివిద రకాల పూలు పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. -
రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
గురుపౌర్ణమిరోజు ఏర్పడిన చంద్రగ్రహణం
-
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ఇల్లెందు: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇల్లెందులో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలు ఆంధ్రలో కలపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు . టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేస్తోందన్నారు. త్వరలో జరగబోవు క్యాబినెట్ సమావేశంలో రూ.18 వేల కోట్లతో 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. జేకే 5 నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన మైన్స్ ఏర్పాటు కృషిచే స్తానన్నారు. ప్యాసింజర్ ైరె లు పునరుద్ధరణకు ఎంపీ సీతారాంనాయక్ కేంద్ర రైల్వేమంత్రితో మాట్లాడరని, త్వరలో రైలు సేవలు అందుబాలులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ ఊకె అబ్బయ్య, కౌన్సిలర్లు జానిపాషా, సామల రాథశ్రీ, ఎర్రోళ్ల తులసీరామ్గౌడ్, నా యకులు దేవిలాల్నాయక్, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, నవీన్, సత్యనారయణ, కృష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా జగదాంబసెంటర్‌లో శ్రీ షిరిడీసాయి మందిరంలో నిర్వహించిన గురుపౌర్ణమి పూజా కార్యక్రమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణాహుతితో ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. సాయిబాబా ఊరేగింపు రథాన్ని పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కేఎన్ఎస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను నాయకులు పూలమాల, శాలువలతో ఘనంగా సత్కరించారు. -
గురు పౌర్ణమి వేడుకలు