పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి.
దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు.
ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment