సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు | Salomi And Naga Tanishka Got Gold Medals | Sakshi
Sakshi News home page

సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు

Published Mon, Aug 26 2019 10:13 AM | Last Updated on Mon, Aug 26 2019 10:13 AM

Salomi And Naga Tanishka Got Gold Medals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్‌కేడీఐ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో కురినెల్లి సలోమీ, జి. నాగ తనిష్కారెడ్డి ఆకట్టుకున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో అండర్‌–11 బాలికల కటా విభాగంలో సలోమీ స్వర్ణాన్ని గెలుచుకుంది. అండర్‌–13 కటా ఈవెంట్‌లో తనిష్క చాంపియన్‌గా నిలిచి పసిడిన కైవసం చేసుకుంది. అనౌష్క రజతాన్ని గెలుచుకోగా... నిత్యారెడ్డి కాంస్యాన్ని అందుకుంది. నమ్రత నాలుగో స్థానంలో నిలిచింది. 

14–15 వయో విభాగం బాలుర కటా ఈవెంట్‌లో టి. ఉదయ్, సర్వేశ్, గిరి శేషు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. 16–17 వయో విభాగం బాలుర కుమిటే విభాగంలో రవీంద్ర పసిడిని సొంతం చేసుకోగా... గోపీ, భరత్, జై మహేశ్‌ వరుసగా తర్వాతి స్థానాలను సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement