
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన రోహిత్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. రాజస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 విభాగంలో బరిలోకి దిగిన రోహిత్ 75 కేజీల కేటగిరిలో అజేయంగా నిలిచాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన రోహిత్ తాను పోటీపడిన నాలుగు రౌండ్‌లలోనూ ప్రత్యర్థులను ఓడించాడు. 2017లో నిర్మల్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ గేమ్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment