
సాక్షి, హైదరాబాద్: భారత స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్‌ఐ) కరాటే చాంపియన్‌షిప్‌లో వడ్డేటి చందన సత్తాచాటింది. దోమల్‌గూడలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. రోజరీ కాన్వెంట్‌కు చెందిన చందన అండర్–14 బాలికల 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో ఆమె రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. సంగారెడ్డిలో ఈనెల 13నుంచి 15వరకు జరిగే రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో చందన హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment