
సాక్షి, బెంగళూరు : ఆమె.. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మాజీ చాంపియన్ కూడా! ఆయన.. ‘ఎంటర్ ది డ్రాగెన్’ లాంటి సినిమాల్లో తప్ప కరాటే ఎరుగరు. కానీ వాళ్లిద్దరూ కలబడ్డారు. పరస్పరం పంచ్‌లు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఆ వీడియోలోని ఆమె.. మంగళూరు మేయర్ కవితా సనిల్ కాగా, ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
పంచ్ పడుద్ది : శనివారం మంగళూరులోని నెహ్రూ మైదానంలో ‘ఇండియన్ కరాటే చాంపియన్‌షిప్-2017’ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం సిద్దూ, మంగళూరు మేయర్ కవిత ముఖ్య అతిథులుగా హాయజర్యారు. పోటీల ప్రారంభసూచికగా సీఎం, మేయర్‌లు సరదాగా తలపడ్డారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
ఆ సినిమా చూసి తెల్సుకున్నా : కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న సీఎం.. తనకు మాత్రం కరాటే రాదని, బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసి కొద్దిగా తెల్సుకున్నానని సీఎం చెప్పుకొచ్చారు.
మేయర్‌కు సీఎం పంచ్ వీడియో


Comments
Please login to add a commentAdd a comment