Karnataka CM Siddaramaiah
-
ఎన్నాళ్లు కుర్చీలో ఉంటానో: సీఎం
మైసూరు: ఎంతకాలం అధికారంలో ఉంటానో తెలియదు, మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు బీజేపీ, జేడీఎస్‌లను సమర్థంగా ఎదుర్కొంటానని, వారి తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తన బావమరిది చెల్లెలికి పసుపు, కుంకుమగా ఇచ్చిన స్థలాన్ని వివాదంలోకి లాగారని ముడా స్థలాల కేసు గురించి వ్యాఖ్యానించారు. చివరకు స్థలాలను కూడా వాపసు ఇచ్చేశామన్నారు. 40 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా తనకు సొంత ఇల్లు లేదన్నారు. ఇటీవలే మైసూరు కువెంపు రోడ్డులో సొంత ఇంటిని కట్టించుకుంటున్నానన్నారు. తనకు చట్టం ద్వారా న్యాయం లభిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.అభ్యర్థుల గురించి..మాజీ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌తో కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించి తాను మాట్లాడలేదని, అయితే పార్టీ సిద్ధాంతాలను మెచ్చి ఎవరొచ్చినా స్వాగతిస్తామని సిద్దరామయ్య అన్నారు. చెన్నపట్టణ సీటును తమ పార్టీ అధ్యక్షులే చూసుకుంటారన్నారు. అభ్యర్థుల జాబితాలో డీకే సురేష్ పేరు కూడా ఉంది, వేచి చూద్దాం అన్నారు. సండూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఈ.తుకారాం భార్యకు టికెట్ ఇస్తామని తెలిపారు. -
మోదీపై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: రెండో దశ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో ఓటింగ్ జరుగుతోంది. ఈ రోజు 14 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో మే 7న జరగనున్న ఎన్నికల్లో మరో 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో కర్ణాటక సీఎం సొంత గ్రామమైన సిద్దరామనహుండిలో ఓటు వేసి విలేకరులతో మాట్లాడారు.కర్ణాటకలో మోదీ వేవ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏనుకూలంగా ఉందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు. తప్పకుండా 28 లోక్‌సభ స్థానాల్లో 20 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయాన్ని సాధించినట్లుగానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు.మూడో దశలో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజారిటీ సాధిస్తుందని సిద్దరామయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి చేసిన ప్రసంగాలు చాలా నిరాశ కలిగిస్తున్నాయి. ఆయన చేసిన ప్రసంగాలు దేశ ప్రధానమంత్రిగా లేదు, అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ఉన్నాయని అన్నారు. -
'అవే మమ్మల్ని గెలిపిస్తాయి'.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
మంత్రుల పిల్లలు, బంధువులకు టిక్కెట్లు ఇవ్వడం వంశపారంపర్య రాజకీయం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓటర్ల సిఫార్సుల అంగీకారం కూడా అభ్యర్థులను ఎంచుకోవడానికి లేదా టికెట్స్ ఇవ్వడానికి కారణం అని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండవ జాబితాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున్ ఖర్గే అల్లుడు, ఐదుగురు పిల్లలను కర్ణాటకలో పోటీలో ఉంచుతున్నట్లు తెలిసింది. దీనిపైన సిద్ధరామయ్య మాట్లాడుతూ.. మేము నియోజకవర్గ ప్రజలు సిఫార్సు చేసిన వారికే టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 20 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో మొత్తం 28 సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీ మాదిరిగా అబద్ధాలు చెప్పబోనని, అది సాధ్యం కాదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు హామీలు తప్పకుండా ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయన్న నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది రూ.36,000 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.52,900 కోట్లు కేటాయిస్తాం. బీజేపీలా అబద్ధాలు చెప్పడం లేదు అని సిద్ధరామయ్య అన్నారు. -
డ్యాన్స్ అదరగొట్టిన సిద్దరామయ్య..!
-
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం వీరు రాహుల్‌గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్‌ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్‌ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..! -
ప్లే స్టోర్ నుంచి సీఎం యాప్ అదృశ్యం
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమైంది. ఈ యాప్ యూజర్లు వ్యక్తిగత డేటాను ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయిస్తుందనే ట్విటర్ యూజర్ల ఆరోపణల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్లే స్టోర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ కూడా కనిపించడం లేదు. వీటి లింక్‌లను క్లిక్ చేస్తే.. ‘ ప్రస్తుతం ఆ కంటెంట్ మీ దేశంలో అందుబాటులో లేదని, వీలైనంత త్వరగా మీరు ఇష్టపడే కంటెంట్ మరిన్ని దేశాలకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెక్ చేయ్యండి’ అని చూపిస్తోంది. ఫ్రెంచ్ సెక్యురిటీ రీసెర్చర్ బాప్టిస్ట్ రాబర్ట్ కూడా సీఎం సిద్ధరామయ్య అధికారిక యాప్ యూజర్ల డేటాను ప్రైవేట్ కంపెనీకి అమ్ముతున్నట్టు ధృవీకరించారు. యూజర్ పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిని ప్రైవేట్ కంపెనీకి పంపుతున్నట్టు తెలిపారు. ఆ యాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోయేదని, సరియైన పరిశీలన చేసుకోలేకపోయేవాడనని తెలిపారు. ఇలా యూజర్ల డేటా ప్రైవేట్ కంపెనీకి చేరుతున్నట్టు ఆయన గుర్తించారు. ఇటీవలే ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేసిందనే ఆరోపణల్లో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కున సంగతి తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యాప్ అదృశ్య కావడం చర్చనీయాంశమైంది. -
‘కరువు జిల్లాలో రూ.10 లక్షలతో డిన్నర్’
సాక్షి, బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కరువు జిల్లా కలబురగిలో సీఎం డిన్నర్ పార్టీ కోసం రూ. పదిలక్షలు వెచ్చించారని బీజేపీ నేత ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాగా కలబురగి రికార్డులకెక్కింది. రైతులు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కలబురగిలో కర్ణాటక సీఎం విందు కోసం ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టారని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెల్కూర్ ఆరోపించారు. సిద్ధరామయ్య రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చేందుకు జిల్లా అధికారులు రూ.10 లక్షలు ఖర్చు చేశారని అన్నారు. ఒక్కో ప్లేట్‌కు రూ 800 ఖర్చు చేశారని, కొందరు వీవీఐపీలకు వెండి కంచాలు, బౌల్స్‌లో వడ్డించారని చెప్పారు. బీజేపీ నేత ఆరోపణలపై కలబురగి జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. కర్ణాటకలో 2018 ప్రధమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్ : వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు : ఆమె.. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మాజీ చాంపియన్ కూడా! ఆయన.. ‘ఎంటర్ ది డ్రాగెన్’ లాంటి సినిమాల్లో తప్ప కరాటే ఎరుగరు. కానీ వాళ్లిద్దరూ కలబడ్డారు. పరస్పరం పంచ్‌లు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఆ వీడియోలోని ఆమె.. మంగళూరు మేయర్ కవితా సనిల్ కాగా, ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. పంచ్ పడుద్ది : శనివారం మంగళూరులోని నెహ్రూ మైదానంలో ‘ఇండియన్ కరాటే చాంపియన్‌షిప్-2017’ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం సిద్దూ, మంగళూరు మేయర్ కవిత ముఖ్య అతిథులుగా హాయజర్యారు. పోటీల ప్రారంభసూచికగా సీఎం, మేయర్లు సరదాగా తలపడ్డారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఆ సినిమా చూసి తెల్సుకున్నా : కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న సీఎం.. తనకు మాత్రం కరాటే రాదని, బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసి కొద్దిగా తెల్సుకున్నానని సీఎం చెప్పుకొచ్చారు. మేయర్‌కు సీఎం పంచ్ వీడియో -
మా ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది..
కర్ణాటక సీఎం సిద్ధు, హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపణ సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా, కన్నడనాట అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గొడవ మొదలైంది. బెంగళూరులో సీఎం క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి రామలింగారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ....‘రాష్ట్రానికి చెందిన కొంత మంది మంత్రులతో పాటు ప్రముఖ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. గత కొంత కాలంగా కేంద్రం ఈ విధంగా ఫోన్లను ట్యాప్ చేస్తూ వస్తోంది’ అని ఆరోపించారు. ’రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాపింగ్ చేయడం లేదు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. కేవలం కేంద్రం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘కేంద్రం ఎప్పటి నుంచో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ వస్తోంది. అయితే ఈ అంశంపై నేను ఇప్పుడు మాట్లాడబోను. ఎందుకంటే ఇలాంటి చిల్లర విషయాలపై స్పందించేంత తీరిక నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. -
మాటలు రావడం లేదు: సీఎం
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గౌరి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో విచారణ కోసం ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంతకులు హెల్మెట్ ధరించి వచ్చి ఈ కిరాతకానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. గౌరీ లంకేశ్ ఇటీవలే తనను కలిశారని, ఎటువంటి ప్రాణహాని ఉందని చెప్పలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయం డీజీపీకి వదిలిపెట్టామన్నారు. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కల్బుర్గీ, దభోల్కర్‌లను హత్యలకు... గౌరి హత్య కేసుకు సంబంధం ఉందో, లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్రంలో అభ్యుదయవాదులందరికీ రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. గౌరీ లంకేశ్ హత్య తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఈ కిరాతకాన్ని ఖండించడానికి మాటలు రావడం లేదని మంగళవారం రాత్రి సిద్ధరామయ్య ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన హత్య. గౌరి మరణంతో కర్ణాటక బలమైన అభ్యుదయ గళాన్ని కోల్పోయింది. నేను స్నేహితురాలిని పోగొట్టుకున్నాన’ని ట్వీట్ చేశారు. -
మెట్రోపాలిటన్ సిటీలో రూ.10కే భోజనం
- బెంగళూరు మహానగరంలో ఇందిర క్యాంటీన్లు - రూ.5కే అల్పాహారం.. ప్రారంభించిన రాహుల్ గాంధీ బెంగళూరు: మెట్రోపాలిటన్ నగరమైన బెంగళూరులో ఇక రూ.10కే భోజనం, రూ.5కు అల్పాహారం లభించనుంది. తక్కువ ధరకే పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఇందిర క్యాంటీన్’లను కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) బెంగళూరు నగరంలో మొత్తం 101 క్యాంటీన్లను నిర్మించింది. జయనగర్‌లోని కనకనపాల్య వద్ద ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను ప్రారంభించిన రాహుల్ వెంట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, బెంగళూరు మేయర్ సహా పలువురు నేతలు ఉన్నారు. రిబ్బన్ కట్ చేసిన అనంతరం లోపలికి వెళ్లిన రాహుల్.. క్యాంటిన్లో కలియతిరిగి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య మార్చి నాటి బడ్జెట్ సమావేశాల్లో.. ఆగస్టు 15 నాటికి ఇందిర క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు బెంగళూరు సిటీలో 198 క్యాంటీన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసిన బీబీఎంపీ.. నిర్ణీత గడువులోగా 101 క్యాంటీన్లను మాత్రమే పూర్తిచేసింది. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 వరకూ తెరిచి ఉండే ‘ఇందిర క్యాంటీన్’లలో రూ.5కే అల్పాహారం, రూ.10కే భోజనాన్ని అందిస్తారు. గతంలో ఉత్తరాఖండ్‌లోనూ నాటి కాంగ్రెస్ సీఎం హరీశ్ రావత్ ‘ఇందిర భోజనశాల’ పేరుతో ఈ తరహా క్యాంటీన్లను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. -
అలా కాంగ్రెస్ పార్టీలో చేరా !
బెంగళూరు : తనను కాంగ్రెస్‌లోకి తీసుకురావటంలో పలువురు నాయకులు ఒత్తడి తెచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, జర్నలిస్ట్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన నిన్న (శుక్రవారం) మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు జాతీయ స్థాయిలో ఏఐపీజేడీ పార్టీని తీసుకురావాలని ఉద్దేశించిన సందర్భంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అహమ్మద్ పటేల్ కలిశారు. తనను నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వద్దకు అహమ్మద్ పటేల్ తీసుకెళ్లారు. మేడమ్ సోనియాగాంధీ మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తామంతా కలసి పనిచేయాలని సూచించారు. దీనికి అంగీకరించి సోనియాగాంధీ సమక్షంలోనే బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరా’నని ఆయన తెలిపారు. సోనియాగాంధీని కలిసిన తరువాత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఎస్.ఎం కృష్ణను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పానని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం నడచుకున్నామని, ఇక ముందు కూడా నడచుకొంటామని హామీనిచ్చారు. ఈ నాలుగేళ్ల తమ అధికార అవధిలో 2013 ఎన్నికల సమయంలో ఇచ్చిన 160 హామీల్లో ఇప్పటి వరకు 150 హామీలు నెరవేర్చామని మిగిలిన 10 హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు. -
ఐఏఎస్ డెత్ మిస్టరీ; కీలక మలుపు
- భార్య దూరమైన వేదనలో అనురాగ్! - సమగ్ర దర్యాప్తు కోరుతూ యూపీ సీఎంకు కర్ణాటక సీఎం లేఖ - అనుమానాలు వ్యక్తంచేస్తూ బీజేపీ ఎంపీ శోభ లేఖాస్త్రం - అధికారి మృతిపై కాంగ్రెస్-బీజేపీ పొలిటికల్ వార్ బెంగళూరు/లక్నో: ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తీసుకుంది. కాంగ్రెస్ కుంభకోణాల గుట్టును పసిగట్టినందుకే ఆయనున చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపించింది. మొన్న యూపీ మంత్రి సురేశ్ ఖన్నా, నేడు ఉడిపి-చిక్మంగళూరు బీజేపీ ఎంపీ శోభ కరంద్లాజే ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి దిత్యానాథ్‌కు లేఖరాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనురాగ్ తివారీ.. కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తు.. బుధవారం లక్నోలోని గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదరీతిలో మరణించిన సంగతి తెలిసిందే. అనురాగ్ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తుచేసి, నిజానిజాలు వెలికితీయాలని సిద్దూ లేఖలో కోరారు. అనురాగ్ మృతితోపాటు విపక్ష బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. శోభ సంచలన ఆరోపణలు కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖలో కమిషనర్‌గా పనిచేస్తోన్న అనురాగ్ తివారీ.. ఇటీవలే ఓ భారీ కుంభకోణాన్ని పసిగట్టారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులకు ఆ కుభకోణంతో సంబంధాలున్నాయని, అందుకే ఆయనను హత్యచేసి ఉంటారని ఉడిపి-చిక్మంగళూరు ఎంపీ శోభ కరంద్లాజే ఆరోపించారు. ఈ మేరకు ఆమె.. యూపీ సీఎం యోగికి ఒక లేఖ రాశారు. ‘ఫుడ్ మాఫియానే ఆ అధికారి(అనురాగ్)ని బలితీసుకుందని కర్ణాటకలోని అధికారులు చర్చించుకోవడం నాకు తెలిసింది’ అని శోభా బాంబు పేల్చారు. అటు యూపీ మంత్రి సురేశ్ కుమార్ ఖన్నాకూడా ఇదే తరహా అనుమానాలను వెలిబుచ్చారు. భార్యతో విడిపోయిన బాధ..! రాకీయపార్టీల ఆరోపణల సంగతి పక్కనపెడితే, అనురాగ్ తివారీ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం గుండెపోటు వల్లే మరణం సంభవించి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బెంగళూరు నుంచి శిక్షణా తరగతుల కోసం ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీకి వెళ్లిన అనురాగ్ తివారీ.. అనంతరం స్వస్థలం లక్నోకు వెళ్లారు. లక్నోలోని అసెంబ్లీ భవనానికి కూతవేటు దూరంలో.. వీఐపీ ఏరియాలోని గెస్ట్ హౌస్ గేటు వద్ద ఆయన కుప్పకూలిపోయరు. ఆస్పత్రికి తరలించేసరికే అనురాగ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, కొద్ది నెలల కిందటే తివారీ తన భార్యతో విడిపోయరని, అప్పటి నుంచి ఆయన బాధలో ఉండిపోయారని సన్నిహితులు పేర్కొన్నారు. మనోవేదనే గుండెపోటుకు కారణం అయిఉండొచ్చని వారు పేర్కొన్నారు. (ఐఏఎస్ అధికారి అనుమానాస్పద మృతి) -
ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం!
మల్టిపెక్స్ లలో సినిమా టికెట్ ధరలను అదుపుచేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు కీలక ఫైలును సిద్ధం చేశారు. ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేస్తే.. మరు క్షణం నుంచే టికెట్ గరిష్ట రూ.200గా నిర్ణయిస్తూ జీవో జారీ అయ్యేది. కానీ అత్యవసర పని నిమిత్తం గురువారం సీఎం దుబాయ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం బాహుబలి-2 విడుదలైంది. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మల్టిపెక్స్ లు పోటీపడ్డాయి. టికెట్ ధరల్ని అమాంతం పెంచేశాయి. కాంబోప్యాక్ ల పేరుతో జనాన్ని అడ్డగోలుగా దోచుకున్నాయి. ఏదైతేనేం.. తొలిరోజే వంద కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించిన బాహుబలి-2.. సినీచరిత్ర రికార్డుల్ని బద్దలుకొట్టేదిశగా దూసుకుపోతోంది. ఆ విధంగా ఫైలుపై సీఎం సంతకం చేయకపోవడం సినిమాకు పరోక్షంగా ఎంతో సాయపడిందని కన్నడ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భారీ ధరకు బాహుబలి టికెట్లు కొన్న సీఎం.. ఇక విదేశాల నుంచి సోమవారం తిరిగొచ్చిన ముఖ్యమంత్రి.. నేరుగా బెంగళూరులోని ఓరియాన్ మాల్ కు వెళ్లి.. ఒక్కో టికెట్ రూ.1050కి కొనుగోలుచేసిమరీ బాహుబలి-2 సినిమా చూశారు. ఇంతకీ ఆయనెవరో కాదు.. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే! సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. కాగా, ఇది సీఎం వ్యక్తిగత విషయమని, మనవడి బలవంతం మేరకే సిద్ధరామయ్య సినిమా చూశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు వాహనంలో వచ్చి బాహుబలి-2 చూసిన సీఎం.. ఆ వెంటనే అధికారిక హోదాలో చాముండేశ్వరీ స్టుడియోకి వెళ్లి 'నిరుత్తరా' అనే కన్నడ సినిమాను వీక్షించారు. నటి భావన నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనకు సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. -
‘వారి సర్టిఫికెట్ అవసరం లేదు’
మైసూరు: భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయాల్సిన అవసముందని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆదివారం నగర శివార్లలోని మండకళ్లి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పని తీరుపై మాజీల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడంతో నంజనగూడు నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని, నంజనగూడు ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. నంజనగూడు విధానసభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదని సిద్ధరామయ్య తెలిపారు. శ్రీనివాస్ ప్రసాద్ తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు తాను స్పందించనని, ఇపుడు ఆయన తమ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో ఆ ఆరోపణలకు స్పందిచాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి తరువాత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా మూడేళ్లు పదవి అనుభవించిన శ్రీనివాస ప్రసాద్ మంత్రి వర్గ విస్తరణలో పదవి తొలగించగానే రాజీనామా చేయడంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. టిప్పు సుల్తాన్‌పై కొంత మంది అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆయన జయంతి వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. బెంగళూరులో నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ నిర్మాణంపై జూన్‌లో సామాజిక మాధ్యమాలలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా 73 శాతం మంది బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలంగా అభిప్రాయాలను సిద్ధరామయ్య వెల్లడించారని తెలిపారు. గోవాలో కన్నడిగులపై దాడులు జరుగడం తనను తీవ్రంగా కలచివేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోవా రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో మాట్లాడారని గోవాలో కన్నడిగులకు భద్రత కల్పించాలని కోరినట్లు సీఎం తెలిపారు. -
మంత్రి గిఫ్ట్ ను తిరస్కరించిన ముఖ్యమంత్రి
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కానుకలంటే హడలిపోతున్నారు. గతంలో హోబ్లేట్ వాచ్ వ్యవహారంలో పీకల్లోతు కూరుకుపోయి...అనంతరం ఏసీబీ క్లీన్‌చిట్‌తో బయటపడిన ఆయన కానుకలు అంటేనే జంకుతున్నారు. తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఏ. మంజు మంగళవారం విధాన సౌధలో సిద్ధరామయ్యకు ఓ గిఫ్ట్ ప్యాక్‌ను అందజేశారు. ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలోచించకుండా ఆ గిఫ్ట్‌ను తీసుకోడానికి నిరాకరించారు. మంజు వివరణ ఇవ్వడంతో అందులో ఏమున్నాయని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేవలం సిల్క్ జుబ్బాలు ఉన్నాయని స్వీకరించాలని కోరారు. దీంతో సీఎం అలాంటివి తాను ధరించనని సున్నితంగా తిరస్కరించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.70 లక్షల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతానని చెప్పుకునే ఆయన ఇంత ఖరీదు చేసే వాచ్‌ను ఎలా కొన్నారు? ఒక వేళ సిద్ధరామయ్య కొనకపోతే ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? బహుమతిగా అందుకొని ఉంటే అందుకు ప్రతిఫలంగా సిద్దరామయ్య ఏం చేశారు? అంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి సంధించిన ప్రశ్నలు అప్పట్లో కలకలాన్ని రేపాయి. ఇక ఈ వాచ్ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ విచారణ కూడా చేపట్టింది. విచారణలో సిద్ధూకు క్లీన్ చిట్ రావటంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి కానుకలు అంటేనే సిద్ధరామయ్య భయపడుతున్నారు. -
కర్ణాటకకు బస్సు సర్వీసులు రద్దు
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమిళ నాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సులను నిలిపివేసింది. ఆందోళనకారులు బస్సులపై దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో జయలలిత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చెన్నైలోని కోయంబేడులో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ఇక మరి కొన్ని బస్సులను హోసూర్ సరిహద్దులో నిలిపివేశారు. మరోవైపు కర్ణాటక మాండ్యాలో ఆందోళనలు విస్తరిస్తున్నాయి. రైతులకు మద్ధతుగా ఇతర వర్గాలు నిరసనబాట పడుతున్నాయి. తాజాగా లాయర్లు కూడా ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే ఈ ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నారు. కొంతమంది నిరసనకారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్టర్లను చింపేయడం కలకలం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమత్రి సిద్ధరామయ్య ఈ రోజు సాయంత్రం అఖిలపక్షంతో సమావేశం కానున్నారు. -
బెంగళూరు-మైసూరు హైవే దిగ్బంధం
బెంగళూరు : తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై కర్ణాటకలో నిరసన వ్యక్తం అవుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిరసనగా కర్ణాటకలో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మరోవైపు రైతు సంఘాలు మాండ్యా బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను రైతులు అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మరోవైపు రైతుల ఆందోళన దృష్ట్యా కృష్ణ రాజసాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్ ను నాలుగు రోజుల పాటు మూసివేశారు. తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల కావేరి జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. కావేరి జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇవాళ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. కావేరి జలాల విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
బెంగళూరు-మైసూరు హైవే దిగ్బంధం
-
మాకే నీళ్లు లేవు !
సాక్షి, చెన్నై: కర్ణాటక నుంచి తమిళనాడులోకి కావేరి జలాల రాక, సంకటంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం చోటు చేసుకున్నాయి. తమకే నీళ్లు లేనప్పుడు ఎలా పంపిణీ చేయగలమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. మానవతాదృక్పథంతో , సోదర భావంతో ఆలోచించాలని తమిళ రైతుల వేడుకోలు పరిశీలన జరుపుతామన్న హామీతో దాటవేత ధోరణి అనుసరించారు. తమిళనాడు- కర్ణాటకల మధ్య జలవివాదం కొత్తేమీ కాదు. ప్రతి ఏటా వాటా నీటి విడుదల కోసం తీవ్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఐదేళ్లుగా వాటా సరిగ్గా అందక, డెల్టా అన్నదాతలు కన్నీటి మడుగులో మునిగారు. ఈ ఏడాది కురువై కోల్పోయిన అన్నదాతలు సంబాను అయినా రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డెల్టా అన్నదాతల వరప్రదాయిని మెట్టూరు డ్యాంలో ప్రస్తుతం ముప్పై టీఎంసీల నీళ్లు ఉన్నా, అది సంబాసాగుకు సరి పడదు. ఈ దృష్ట్యా, తమిళనాడుకు వాటాగా విడుదల చేయాల్సిన నీటి కోసం కర్ణాటకతో పోరాటానికి రాష్ర్ట ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అన్నదాతలు జలం కోసం గళం విప్పుతూ నిరసనల బాట పటాటరు. ఈ నిరసనలు రెండు మూడు రోజుల్లో మరింత ఉధృతం కాబోతున్నాయి. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం తమ గోడును పట్టించుకోని నేపథ్యంలో, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అయినా వేడుకుందామనుకున్నట్టుగా బెంగళూరు వైపుగా రైతు నాయకులు కదలడం గమనార్హం. నీటి విడుదల కష్టమే: మాజీ ఎంపీ, ప్రకృతి, జలవనరుల పరిరక్షణ సంఘం నేత రామలింగం, ఉలవర్ఉలైపాలి కట్చి నేత చెల్లముత్తుల నేతృత్వంలో ఇరవైకు పైగా రైతు సంఘాల నాయకులు ఏకం అయ్యారు. వీరంతా ఉదయాన్నే బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్దకు చేరుకుని తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు సిద్ధరామయ్య అనుమతి ఇవ్వడంతో ఆయన నివాశంలో అర గంట పాటు భేటీ అయ్యారు. ప్రధానంగా డెల్టా జిల్లాల్లోని అన్నదాతల దయనీయ పరిస్థితి, సంబాసాగుబడికి కావాల్సిన నీళ్లు, తమ అన్నదాతల్ని ఆదుకునే విధంగా కావేరిలో నీటి విడుదలకు విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించారు. దానిని పరిశీలించిన సిద్ధరామయ్య తమకే నీళ్లు లేదు అని, ఇంకెక్కడ కావేరిలో విడుదల చేయగలమని స్పందించడం గమనార్హం. తమకే వర్షాలు సరిగ్గా పడ లేదు అని, ఉన్న నీళ్లు కేవలం తాగు నీటికి మాత్రం వాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, నీళ్లు విడుదల కష్టమేనని స్పష్టం చేయడంతో రైతు సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. మానవతాదృక్పథంతో ఆలోచించాలని, సోదరభావంతో తమకు సహకారం అందించాలని ఈసందర్భంగా సిద్ధరామయ్యను రైతు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సోదరతత్వాన్ని వివరిస్తూ, సంబాసాగుబడి నిమిత్తం తమను ఆదుకోవాలని విన్నవించారు. చివరకు పరిశీలిస్తామన్న హామీతో దాటవేత ధోరణిని కర్ణాటక సీఎం అనుసరించి ఉండడం బట్టి చూస్తే, కావేరి ఈ సారి రాష్ట్రంలోకి సంవృద్ధిగా వచ్చేది అనుమానంగా మారింది. సెప్టెంబర్ చివరి నాటికి నీళ్లు ఇచ్చినా సంబాసాగుకు ఆస్కారం ఉంది. ఆ తర్వాత నీళ్లు ఇచ్చినా ఉపయోగం శూన్యమే. దీన్ని బట్టి చూస్తే, జల సంకట నేపథ్యంలో సంబాసాగు ఈ ఏడాది కూడా ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. అఖిల పక్షం, తీర్మానానికి పట్టు: సిద్ధరామయ్యతో రైతు సంఘాల భేటీ నేపథ్యంలో ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ మదురైలో స్పందించారు. కావేరి జలాల విడుదలలో నెలకొంటున్న పరిస్థితులపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు అఖిల పక్షానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. అఖిల పక్షం తదుపరి, ప్రత్యేక తీర్మానం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావాలని, తదుపరి సంబంధిత మంత్రితో అఖిల పక్షం సభ్యులు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సిద్ధరామయ్యకు పుత్రశోకం
అనారోగ్యంతో బెల్జియంలో మృతిచెందిన రాకేశ్ సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేశ్(39) శనివారం బెల్జియంలో అనారోగ్యంతో కన్నుమూశారు. రాకేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొం తకాలంగా క్లోమ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత వారం యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో స్నేహితులు బ్రస్సెల్స్‌లోని ఆంట్వెర్ప్ వర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసి వెంటనే సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, రెండో కొడుకు యతీంద్ర బెల్జియం వెళ్లారు. క్లోమవ్యాధితో అవయవాలు దెబ్బతిని రాకేశ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. భౌతికకాయాన్ని ఆదివారం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకురానున్నారు. అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ప్రధాని మోదీ, సోనియా సంతాపం..: రాకేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. సిద్ధరామయ్య కొడుకు మరణించడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. రాకేశ్ మృతిపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పతో పాటు పలువురు నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. ఈ నెల 13న రాకేష్ జన్మదినోత్సవాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం అభిమానుల్లో విషాదం నింపింది. -
అమరులకు సలాం..!
అంబాలా/బెంగళూరు: పఠాన్‌కోట్‌లో పాక్ ముష్కరులతో పోరాడి అమరులైన జవాన్లకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాల మధ్య వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ భౌతిక కాయాన్ని సోమవారం ఆయన సొంతూరు హర్యానాలోని అంబాలా సమీపంలోని గర్నాలాకు తీసుకువచ్చారు. పార్థివ దేహాన్ని చూడగానే కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గురుసేవక్కు నవంబర్లోనే వివాహమైంది. ఆయన అంత్యక్రియల్లో హర్యానా మంత్రులు అనిల్ విజ్, అభిమన్యులతోపాటు ఆర్మీ, పోలీసు, వైమానిక దళాధికారులు పాల్గొన్నారు. ► పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్‌ను నిర్వీర్వం చేస్తుండగా అది పేలడంతో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ ఇ.కె. నిరంజన్ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సందర్శించి నివాళులర్పించారు. నిరంజన్ కుటుంబానికి సీఎం రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తర్వాత నిరంజన్ పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు. ‘నా కొడుకు త్యాగానికి నేను గర్విస్తున్నా..’ అని చెమర్చిన కళ్లతో నిరంజన్ తండ్రి శివరంజన్ చెప్పారు. 32 ఏళ్ల నిరంజన్‌కు భార్య, 18 నెలల కూతురు ఉన్నారు. ► ఉగ్రవాదుల తూటాలకు బలైన సుబేదార్ ఫతేసింగ్(51) పార్థివదేహాన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు తీసుకువచ్చారు. షూటింగ్లో మంచి ప్రతిభ గల ఫతేసింగ్ కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిపెట్టారు. జవాన్లతో కలిసి ఫతేసింగ్ కూతురు మధు తన తండ్రి భౌతికకాయాన్ని మోయడం అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఝాన్దేవాల్ కుర్ద్ గ్రామంలోని ఫతేసింగ్ కుటుంబసభ్యులను సోమవారం పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కలిసి పరామర్శించారు. ► ఉగ్రవాద దాడిలో కన్నుమూసిన మరో అమరుడు హావిల్దార్ కుల్వంత్సింగ్కు పంజాబ్‌లోని ఆయన సొంతూరు చాక్ షరీఫ్ గ్రామంలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుల్వంత్ సింగ్ కుటుంబీకులను సైతం సీఎం బాదల్ కలసి పరామర్శించారు. ► ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవీల్దార్ సంజీవన్ సింగ్ రానా(50) అంత్యక్రియలు ఆయన స్వస్థలం కంగ్రా జిల్లా సియన్ గ్రామంలో, హవీల్దార్ జగదీశ్ చంద్(58) అంత్యక్రియలు చంబా జిల్లా గోలా గ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వీరిద్దరి కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వీర్‌భద్రసింగ్ ప్రకటించారు. లాన్స్ నాయక్ మూల్ రాజ్ అంత్యక్రియలను ఆయన సొంతూరైన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని సాంబా జిల్లా జాఖ్ గ్రామంలో నిర్వహించారు. అమర జవాన్లు ఉగ్రవాదులతో కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, ఒక ఎన్ఎస్జీ అధికారి, ఐదుగురు డిఫెన్స్ సెక్యూరిటీ కోర్(డీఎస్సీ) సిబ్బంది మరణించారు. మరో 17 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ► గురుసేవక్ సింగ్ - గరుడ్ కమాండో ► ఇ.కె. నిరంజన్ -లెఫ్టినెంట్ కల్నల్ (ఎన్ఎస్జీ) ► ఫతేసింగ్- సుబేదార్ మేజర్ (డీఎస్సీ) ► మూల్ రాజ్-లాన్స్ నాయక్(డీఎస్సీ) ► సంజీవన్ సింగ్-హవల్దార్(డీఎస్సీ) ► జగదీశ్ చంద్- హవల్దార్ (డీఎస్సీ) ► కుల్వంత్ సింగ్- హవల్దార్ (డీఎస్సీ) -
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు
హోమాలతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందా? సాక్షి, బెంగళూరు: ‘రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించారు. హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా?’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. మంగళవారం విధానసౌధలో ఏర్పాటు చేసిన కవి కువెంపు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? అదే కనుక నిజమైతే దేశంలో కరువు ఛాయలే కనిపించేవి కాదు. దేశాన్నే సుభిక్షంగా చేసేవాళ్లం’ అని ఎద్దేవా చేశారు. చదువుకున్న వాళ్లు కూడా కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు. -
ఆ పేరు మార్చేది లేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చేదిలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్న వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయనీ ప్రకటన చేశారు. కాగా ప్రజల మనోభావాలను కర్ణాటక ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా స్పందించాలన్నారు. బెంగళూరు వ్యవస్థాపకుడైన కెంపెగౌడను కర్ణాటక ప్రజలు ఎంతో గౌరవిస్తారని చెప్పారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని తాను చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంపై ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధకరమని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని, దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో కర్ణాటకలో ఘర్షణలు చెలరేగాయి.