బెంగళూరు: రెండో దశ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో ఓటింగ్ జరుగుతోంది. ఈ రోజు 14 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో మే 7న జరగనున్న ఎన్నికల్లో మరో 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో కర్ణాటక సీఎం సొంత గ్రామమైన సిద్దరామనహుండిలో ఓటు వేసి విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటకలో మోదీ వేవ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏనుకూలంగా ఉందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు. తప్పకుండా 28 లోక్‌సభ స్థానాల్లో 20 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయాన్ని సాధించినట్లుగానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు.
మూడో దశలో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజారిటీ సాధిస్తుందని సిద్దరామయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి చేసిన ప్రసంగాలు చాలా నిరాశ కలిగిస్తున్నాయి. ఆయన చేసిన ప్రసంగాలు దేశ ప్రధానమంత్రిగా లేదు, అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ఉన్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment